వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ బెంగళూరు: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (COVID 19) భారతదేశంలో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రెండు వారాల క్రితం ఒకానొక సమయంలో భారతదేశంలో కరోనావైరస్ వైరస్ నియంత్రణలో ఉందని అందరూ భావించారు. కానీ గత రెండు వారాలుగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతోంది. చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తించి పాశ్చాత్య దేశాలకు పాకి వారి ప్రాణాలను గాల్లో కలిపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 17 లక్షల మందికి పైగా వరకు కరోనా వైరస్ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాధితో లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటివరకు కేవలం 4 లక్షల మంది మాత్రమే కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ కేసుల్లో 63 శాతం కేసులు ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ నుంచి వ్యాప్తి చెందాయని, వారి వలనే ప్రస్తుతం భారత్ ఇబ్బందులు పడుతోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్ సంచలన ఆరోపణలు చేశారు

Coronavirus: బీహార్ లో 60 కరోనా కేసులు, ఒక్కడి దెబ్బకు ఫ్యామిలీలో 23 మందికి, మీరు జాగ్రత్త!Coronavirus: బీహార్ లో 60 కరోనా కేసులు, ఒక్కడి దెబ్బకు ఫ్యామిలీలో 23 మందికి, మీరు జాగ్రత్త!

భారత్ లో కరోనా కాటు

భారత్ లో కరోనా కాటు

భారతదేశంలో 7,529 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకిందని, 6, 634 ఐసోలేషన్, క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాధి సోకి 242 మంది ప్రాణాలు పోయాయి. 653 మంది కరోనా వైరస్ మహమ్మారి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ కేసులు పెరిగిపోకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి.

ప్రపంచ దేశాలు

ప్రపంచ దేశాలు

చైనాలో పుట్టిపురుడు పోసుకున్న కరోనా వైరస్ భారత్ తో పాటు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికాతో పాటు ఎంతో అభివృద్ది చెందిన దేశాలకు వ్యాపించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా లక్ష మందికి పైగా కరోనా వైరస్ వ్యాధితో మరణించారు. కరోనా వైరస్ వ్యాధి దెబ్బకు ఇంకా ఎంత మంది ప్రాణాలు పోతాయో చెప్పడం చాలా కష్టంగా ఉందని ప్రముఖులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ఢిల్లీ తబ్లీగ్ జమాత్ కారణం

ఢిల్లీ తబ్లీగ్ జమాత్ కారణం

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాపించకుండా కేంద్రం ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు శక్తి వంచన లేకుండా పని చేస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ సీనియర్ నేత బీఎల్. సంతోష్ అన్నారు. అయితే భారతదేశంలో కరోనా వైరస్ కేసులు వ్యాపించడానికి ప్రధాన కారణం ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ సభ్యులే అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్ సంచలన ఆరోపణలు చేశారు.

130 కోట్ల మందికి సాధ్యం అవుతుందా?

130 కోట్ల మందికి సాధ్యం అవుతుందా?

కరోనా వైరస్ వ్యాధి సోకకుండా భారతదేశంలోని 130 కోట్ల మందికి ఒకేసారి వైద్యం చెయ్యడం సాధ్యం అవుతుందా ? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్ ప్రశ్నించారు. అందుకే కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేశారని, ప్రజలు అందరూ ఎంతో పెద్ద మనసుతో లాక్ డౌన్ కు పూర్తిగా సహకరిస్తున్నారని బీఎల్. సంతోష్ అన్నారు.

ఢిల్లీ తబ్లీగ్ జమాత్ దెబ్బ

ఢిల్లీ తబ్లీగ్ జమాత్ దెబ్బ

దేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా కేసులో 63 శాతం కేసులు ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ నుంచి వ్యాపించాయని, కరోనా వైరస్ వ్యాధి వ్యాపించడానికి తబ్లీగ్ జమాత్ కార్యకర్తలు కారణం అయ్యారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్ సంచలన ఆరోపణలు చేశారు. ఇంకా 500 మంది తబ్లీగ్ జమాత్ కార్యకర్తలు తప్పించుకుని పారిపోయారని, వారు ఢిల్లీ, భోపాల్ తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నారని, సమాచారం తెలుసుకున్న అధికారులు వారి కోసం గాలిస్తున్నారని బీఎల్. సంతోష్ అన్నారు. పరారిలో ఉన్న కొందరు తబ్లీగ్ జమాత్ కార్యర్తలను పోలీసులు అరెస్టు చేసి క్వారంటైన్ కు తరలించారని బీఎల్. సంతోష్ చెప్పారు.

కేంద్రం సీరియస్

కేంద్రం సీరియస్

బీజేపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సీనియర్ నేత బీఎల్. సంతోష్ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పెద్దలు సీరియస్ గా తీసుకున్నారు. పార్టీలో ఎంతో పేరు ఉన్న బీఎల్. సంతోష్ ఎప్పుడూ, ఎక్కడా నోరుజారిన దాఖలాలు లేవు. ఏదైనా ఆలోచించి పూర్తి సమాచారం తెలుసుకునే బీఎల్. సంతోష్ మాట్లాడాతారని బీజేపీ పెద్దలు అంటున్నారు. దేశంలోని 63 శాతం కరోనా కేసులు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ కార్యకర్తల నుంచి వ్యాపించాయని బీఎల్. సంతోష్ ఆరోపించడంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నదని ఓ సీనియర్ బీజేపీ నేత అంటున్నారు. కర్ణాటకకు చెందిన బీఎల్. సంతోష్ కరోనా కేసులు ఎక్కువగా వ్యాపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. కర్ణాటకలో సుమారు 800 మందికి పైగా తబ్లీగ్ జమాత్ కార్యకర్తలు ఉన్నారు. వారిలో చాలా మందిని ఇప్పటికే క్వారంటైన్ కు తరలించారు.

Recommended Video

Telangana Lockdown Extension Till April 30th, Consequences

English summary
Coronavirus: Tablighi Jamaat is responsible for 63% of COVID 19 infected cases found in country. BL Santosh alleges that the infection was spread by Tablighi Jamaat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X