బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: చైనా నుంచి కంటైనర్ లో కరోనా తెచ్చారు, 900 మంది క్వారంటైన్, బీజేపీ ఎమ్మెల్యే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మైసూరు: కరోనా వైరస్ (COVID 19) ఎప్పుడు ఏ రూపంలో వ్యాపిస్తుందో చెప్పడం చాలా కష్టంగా తయారైయ్యింది. కంటికి కనపడని కరోనా పేరు చెబితే ప్రపంచ దేశాల ప్రజలు హడలిపోతున్నారు. అయితే కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని నంజనగూడ్ లోని జూబ్లియంట్ జెనెరిక్స్ ఫ్యాక్టరీకి చైనా నుంచి కంటైనర్ లో ముడికి సరుకు దిగుమతి కావడం, ఆ ఫ్యాక్టరీ ఉద్యోగికి కరోనా వైరస్ సోకడంతో ఆ కంపెనీ ఉద్యోగులు హడలిపోయారు. ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న 900 మంది ప్రస్తుతం హౌస్ క్వారంటైన్ లో ఉన్నారు. లాక్ డౌన్ నియమాలు పక్కన పెట్టిన ఫ్యాక్టరీ యాజమాన్యం ఉద్యోగులతో పని చేయిస్తూ వారితో పాటు మా ఊరి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆందోళనకుదిగారు.

Coronavirus Lockdown: బంపర్ ఆఫర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కుక్కర్, బీరువా, వామ్మో !Coronavirus Lockdown: బంపర్ ఆఫర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కుక్కర్, బీరువా, వామ్మో !

ప్రసిద్ది చెందిన ఫ్యాక్టరీ

ప్రసిద్ది చెందిన ఫ్యాక్టరీ

మైసూరు జిల్లాలోని నంజనగూడ్ లో ప్రసిద్ది చెందిన జూబ్లియంట్ జెనెరిక్స్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదే ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. అయినా జూబ్లియంట్ జెనెరిక్స్ ఫ్యాక్టరీ మూత పడలేదని ఆరోపణలు ఉన్నాయి. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి ఫ్యాక్టరీ కార్యకలాపాలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్దన్ ఆరోపిస్తున్నారు.

ఒక్క దెబ్బతో 900 మంది క్వారంటైన్

ఒక్క దెబ్బతో 900 మంది క్వారంటైన్

జూబ్లియంట్ జెనెటిక్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. అయినా ఫ్యాక్టరీకి తాళం వెయ్యకుండా ఉద్యోగులతో బలవంతంగా పని చేయించారని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్దన్ ఆరోపించారు. ఒక్క వ్యక్తికి కరోనా సోకడంతో ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న 900 మందికిపైగా ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని, వారికి ఎదైనా జరగరానిది జరిగితే ఎవ్వరు భాద్యులు అని బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్దన్ ప్రశ్నిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ కారణంగా నంజనగూడ్ ప్రజలు అందరూ కరోనా భయంతో హడలిపోతున్నారని బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్దన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చైనా కంటైనర్ లో ముడిసరుకు !

చైనా కంటైనర్ లో ముడిసరుకు !

చైనా నుంచి ముడిసరుకు కంటైనర్ లో జూబ్లియంట్ జెనెటిక్స్ ఫ్యాక్టరీకి రవాణా అయ్యిందని ఎమ్మెల్యే హర్షవర్దన్ అన్నారు. మార్చి నెలలో చైనాలో కరోనా వైరస్ తాండవం చేసిందని, ఇంత జరిగినా అదే నెలలో అక్కడి నుంచి ముడిసరుకును జూబ్లియంట్ జెనెటిక్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం తెప్పించుకుని అక్కడి ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడిందని బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్దన్ ఆరోపించారు.

చైనా కరోనా చావులు గుర్తుకు రాలేదా ?

చైనా కరోనా చావులు గుర్తుకు రాలేదా ?

కరోనా వైరస్ కారణంగా చైనాలో కొన్ని వేల మంది మరణించారని బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్దన్ గుర్తు చేశారు. చైనాలో పుట్టి పురుడుపోసుకున్న కరోనా వైరస్ కారణంగా ప్రపంచం దేశాలు మొత్తం హడలిపోతున్నాయని, అలాంటి సమయంలో ఆదేశం నుంచి ముడిసరుకు దిగుమతి చేసుకున్న ఫ్యాక్టరీ యాజమాన్యం అక్కడ పని చేస్తున్న పేద కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్దన్ మండిపడ్డారు.

చైనా టూ చెనై, బెంగళూరు టూ మైసూరు

చైనా టూ చెనై, బెంగళూరు టూ మైసూరు

చైనా నుంచి కంటైనర్ లో ముడిసరుకు మొదట చెన్నై వచ్చిందని, అక్కడి నుంచి బెంగళూరు మీదుగా నంజనగూడ్ వచ్చింది. ముడిసరుకు ఉన్న కంటైనర్ లో రెండు బ్యాగులు ఉన్నాయని, ఆ బ్యాగ్ ల్లోని ఔషదాల్లో కరోనా వైరస్ వ్యాపించి ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్దన్ ఆరోపించారు. కంటైనర్ ను పరిశీలించకుండానే ఫ్యాక్టరీలోకి తీసుకువచ్చారని హర్షవర్దన్ విమర్శిస్తున్నారు.

ఆస్ట్రేలియా కాదు చైనా నుంచి కరోనా !

ఆస్ట్రేలియా కాదు చైనా నుంచి కరోనా !

మొదట ఈ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఉద్యోగి స్నేహితుడు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడని, అతని నుంచి ఆ ఫ్యాక్టరీ ఉద్యోగికి కరోనా వైరస్ సోకిందని మొదట అనుమానం వచ్చిందని, అయితే చివరికి చైనా నుంచి ముడిసరుకు వచ్చిన కంటైనర్ ద్వారానే కరోనా వైరస్ సోకిందని వెలుగు చూసిందని బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్దన్ ఆరోపించారు. మొదట ఈ ఫ్యాక్టరీని సీజ్ చేసి ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో విచారణ చేసి అక్కడ పని చేస్తున్న ఉద్యోగులకు న్యాయం చెయ్యాలని, నిర్లక్షంగా చైనా నుంచి ముడిసరకు దిగుమతి చేసుకున్న ఫ్యాక్టరీ యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్దన్ ప్రభుత్వానికి మనవి చేశారు. ఈ ఫ్యాక్టరీని సీజ్ చెయ్యకుంటే నంజనగూడ్ మొత్తం కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని, వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్దన్ డిమాండ్ చేశారు.

English summary
COVID 19: Karnataka BJP MLA Harshawardhan has alleges that, the importing of raw material from China to Jubiliant factory may be the reason to spread Coronavirus in Nanjanagudu near Mysuru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X