• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా - అమిత్ షా చేరిన కార్పొరేట్ ఆస్పత్రిలోనే..

|

కేంద్ర కేబినెట్ పై కరోనా ప్రభావం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా ఇన్ఫెక్షన్ కు గురికాగా, న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్, పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో తదితరులు ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. తాజాగా పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.

తాను కరోనా బారినపడ్డ విషయాన్ని మంత్రి ప్రధాన్ మంగళవారం సాయంత్రం స్వయంగా వెల్లడించారు. 'కరోనా లక్షణాలుగా అనుమానించి పరీక్షలు చేయించుకున్నాను. పాజిటివ్‌గా తేలింది. వైద్యుల సలహా మేరకు హాస్పిటల్‌లో చేరాను. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది'' అని ట్వీట్ చేశారు.

ఆక్స్ ఫర్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్: కీలక అడుగు-ఇండియాలో ఫేజ్-3 ట్రయల్స్‌కు కేంద్రం ఓకే-సీరం ఆధ్వర్యంలో

covid-19: Union Minister Dharmendra Pradhan Tests Covid Positive, Hospitalised

అమిత్ షా చికిత్స పొందుతోన్న గురుగ్రామ్ లోని 'మేదాంత ఆస్పత్రి'లోనే ధర్మేంద్ర ప్రధాన్ కూడా చేరారు. కరోనాకు గురైన కేంద్ర మంత్రులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతుండటంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ''హోం మంత్రికి ఆరోగ్యం బాగాలేప్పుడు ఢిల్లీ ఎయిమ్స్‌కు కాకుండా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లడం వెళ్లడం నన్ను ఆశ్చార్యానికి గురిచేసింది. ఇలాచేస్తే ప్రభుత్వ సంస్థలపై ప్రజలకు విశ్వాసం ఎలా పెరుగుతుంది?''అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశ్నించారు.

కొవిడ్-19 వ్యాక్సిన్ పై గుడ్, బిగ్ న్యూస్ -వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే -భారత్ బయోటెక్ కృష్ణ ఎల్లా

  Cyclone Amphan : Super Cyclone Likely To Weaken, govt Evacuates People in Coastal Areas

  కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 52,050 కొత్త కేసులు, 803 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18.78లక్షలకు, మరణాల సంఖ్య 39వేలకు పెరిగింది. ఇప్పటిదాకా 12.5లక్షల మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 5.89లక్షలుగా ఉంది. సోమవారం నాటికి 2.08కోట్ల శాంపిల్స్ ను టెస్టు చేసినట్లు బులిటెన్ లో పేర్కొన్నారు.

  English summary
  Union Minister Dharmendra Pradhan on Tuesday tested positive for coronavirus and has been admitted to the Medanta Hospital. The development comes two days after Union Home Minister Amit Shah tested positive for the infectious disease.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X