వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నపుంసకత్వం వస్తోందా..? కరోనా టీకాపై భయాలు.. అబ్బే అదేం లేదన్న కేంద్రం..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాక్సిన్ సిద్ధమైంది. రేపు (శనివారం) దేశవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తలకు టీకా ఇవ్వబోతున్నారు. ఈ మహాత్తర కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. టీకాపై అప్పుడే ఆందోళనలు నెలకొన్నాయి. వ్యాక్సిన్ వేసుకుంటే నపుంసకత్వం వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పురుషులు/ స్త్రీలు ఇద్దరికీ వస్తుందనే ప్రచారం జరుగుతోంది.

కరోనా వ్యాక్సిన్‌పై మంత్రులు, అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం.. నేతలు అలర్ట్‌గా ఉండాలంటూ..కరోనా వ్యాక్సిన్‌పై మంత్రులు, అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం.. నేతలు అలర్ట్‌గా ఉండాలంటూ..

టీకాపై అనుమానాలు..

టీకాపై అనుమానాలు..

టీకాలపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. ప్రపంచంలో కరోనా టీకా వల్ల కొందరికీ సైడ్‌ఎఫెక్ట్‌ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా రంగంలోకి దిగారు. టీకాలపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. కరోనా టీకా వలన నపుంసకులు అవుతారని వినిపిస్తున్న ఊహాగానాలను హర్షవర్థన్ ఖండించారు. తప్పుడు ప్రచారం చేయొద్దని స్పష్టంచేశారు.

నపుంసకత్వం..

నపుంసకత్వం..

ఇటీవల రాజకీయ నేత ఇలాంటి కామెంట్ చేశారు. కరోనా టీకా వల్ల మహిళలు గానీ, పురుషులు గానీ నపుసంకులు అవుతారని శాస్త్రవేత్తలెవరూ చెప్పలేదన్నారు. అటువంటి ఆధారాలు కూడా లేవన్నారు. నిరాధారమైన ఊహాగానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కోవిడ్ టీకా వేయించుకున్న తరువాత కొందరిలో స్వల్ప జ్వరం, టీకా వేయించుకున్న ప్రాంతంలో నొప్పి మాత్రం ఉంటుందని అన్నారు. ఇదీ ఏ టీకా వేసినా ఉంటుందని.. ఇందులో కొత్తేమీ లేదన్నారు.

ఇతర వ్యాక్సిన్ కూడా..

ఇతర వ్యాక్సిన్ కూడా..

కరోనా టీకా కాదు ఇతర టీకాలు వేయించుకున్నప్పుడు కూడా ఇదేవిధంగా జరుగుతుందన్నారు. కొద్ది సేపటిలో ఇలాంటి సమస్యలు మాయమవుతాయని అన్నారు. కానీ గొరంతను కొండంత చేయడం సరికాదన్నారు. తీరు మార్చుకోవాలని హితవు పలికారు. కొందరు చేసే ప్రచారంతో.. అపోహలు తీవ్ర స్థాయికి వెళ్లే అవకాశం ఉందన్నారు. ఏదైనా అంశం మాట్లాడితే దానికి సంబంధించి నిజ నిజాలు తెలుసుకోవాలని సూచించారు. ఆధారాలు చూపించి కామెంట్స్ చేస్తే బాగుంటుందని హితవు పలికారు.

English summary
covid 19 vaccine causes infertility in men or women what are other side effects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X