COVID-19 vaccine: గుడ్ న్యూస్, డిసెంబర్ కు 10 కోట్ల కొవిడ్ వ్యాన్సిన్ లు, అదార్ పూనావాలా !
న్యూఢిల్లీ/ బెంగళూరు: అక్స్ ఫర్డ్ యూనివర్శిటీ- అస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ది చేసిన COVID-19 వ్యాక్సిన్ వినియోగానికి డిసెంబర్ నెలలో అనుమతులు లభించవచ్చని, అందుకోసం వచ్చే నెల కల్లా 10 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు సిద్దం చెయ్యాలని లక్షంగా పెట్టుకున్నామని సీరమ్ ఇన్ స్టిట్యూట్ CEO (ముఖ్య కార్యనిర్వహణ అధికారి) అదార్ పూనావాలా వెల్లడించారు. వచ్చే డిసెంబర్ నాటికి కోవిడ్-19 వ్యాక్సిన్ కు అనుమతులు వస్తాయని సీరమ్ సీఈఓ అదార్ పూనావాలా అంచనా వేస్తున్నారు. అందుకోసం కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తులు వేగవంతం చేశామని సీరమ్ సీఈఓ అదార్ పూనావాలా స్పష్టం చేశారు.
Arnab Goswami: లేడీ పోలీసు ఆఫీసర్ పై దాడి చేశారని ఆర్నబ్ పై మరో కేసు, అరెస్టు చేస్తారని, కోర్టులో!

50-50 శాతం పంపిణి
కరోనా వ్యాక్సిన్ లను వచ్చే డిసెంబర్ లో భారత్ లో పంపిణి చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని సీరమ్ సీఈఓ అదార్ పూనావాలా చెప్పారని బ్లూమ్ బర్గ్ వివరించింది. కొవిడ్ వ్యాక్సిన్ వినియోగానికి 2021లో పూర్తిస్థాయి అనుమతులు లభిస్తే 50-50 శాతం నిష్పత్తితో దక్షిణ ఆసియా దేశాలకు, పేద దేశాలకు సరఫరా చెయ్యాలని నిర్ణయించామని అన్నారు.

ఐదు సంస్థలతో సీరమ్ భాగస్వామ్యం
కొవిడ్ వ్యాక్సిన్ ను అభివృద్ది చేస్తున్న ఐదు సంస్థలతో సీరమ్ ఇన్ స్టిట్యూట్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. గత నెలలో అస్ట్రాజెనెకా టీకాను 4 కోట్ల డోసులను ఉత్పత్తి చేసింది. నోవావ్యాక్స్ అభివృద్ది చేస్తున్న టీకా ఉత్పత్తిని కూడా త్వరలోనే ప్రారంభించాలని భావిస్తోంది. డిసెంబర్ నెలలో కొవిడ్ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో వస్తే అందరూ సంతోషిస్తారని సంబంధిత అధికారులు అంటున్నారు.

రెండు వ్యాక్సిన్ లు పని చేస్తున్నాయి
అస్ట్రాజెనెకా- అక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, నోవావ్యాక్స్ టీకాలు రెండు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కనిపిస్తోందని, ఇవి రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతలో నిల్వ చేసి సరఫరా చెయ్యవచ్చని అదార్ పూనావాలా పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు డిసెంబర్ కల్లా భారీగా టీకా డోసులను అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆస్ట్రాజెనెకా CEO పాస్కల్ సోరియట్ స్పష్టం చేశారు.

2024 టార్గెట్, రూ. 80, 000 కోట్లు అవసరం
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అందరికీ కొవిడ్-19 వ్యాక్సి్ వెయ్యడానికి 2024 వరకు సమయం పట్టే అవకాశం ఉందని అదార్ పూనావాలా అంటున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు కరోనా వైరస్ ను ఎంత వరకు అరికట్టాము అని అంచనా వెయ్యడానికి అవకాశం ఉంటుందని పూనావాలా చెబుతున్నారు. కొవిడ్ టీకాలు భారత్ లో అందరికీ అందించాలంటే రూ. 80, 000 కోట్లు అవసరం అని గత సెప్టెంబర్ నెలలో పూనావాల భారత ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు.

కరోనాకు 12 లక్షల మంది బలి
భారత ప్రభుత్వం ఇప్పటికే కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం రూ. 50, 000 కోట్లు కేటాయించిందని విశ్వవసనీయ వర్గాలు తెలిపాయి. మొత్తం మీద డిసెంబర్ నాటికి కొవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కాటుకు 12 లక్షల మందికి పైగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.