• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

COVID Vaccine: సైకిల్ మీద కరోనా వ్యాక్సిన్, పక్కన గన్ మ్యాన్ లు, అబ్బా, దేవుడా, వ్యాక్సిన్ డ్రైరన్ ఇలాగేనా ?

|

లక్నో/బెంగళూరు/ న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకుంటే ఏదో ఒకపని చేసి జీవనం సాగించవచ్చు అంటూ చాలా మంది డిసైడ్ అయిపోయారు. కరోనా వైరస్ విరుగుడికి భారతదేశంలో కరోనా టీకా డ్రైరన్ కొనసాగుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్ వెయ్యడానికి ఏ స్థాయిలో రెడీగా ఉన్నాయో ఈ కరోనా డ్రైరన్ ద్వారా తెలుసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచం మొత్తం కరోనా టీకా సక్సస్ కావాలని కోరుకుంటోంది. ఇలాంటి సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడుతుందని భావిస్తున్న కరోనా టీకాను సింపుల్ గా సైకిల్ మీద తరలించడం, పైగా సైకిల్ పక్కన గన్ మ్యాన్ లు ఉండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రచర్చకు దారితీసింది. ఈ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదురౌతున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కూల్ గా సమాధానం ఇస్తోంది.

Violent wife: అర్దరాత్రి వెళ్లి దుప్పటి కప్పుకుని నిద్రపోతున్న భర్త, విరహం తట్టుకోలేని భార్య, రివర్స్ గేర్ లోViolent wife: అర్దరాత్రి వెళ్లి దుప్పటి కప్పుకుని నిద్రపోతున్న భర్త, విరహం తట్టుకోలేని భార్య, రివర్స్ గేర్ లో

 కరోనా వ్యాక్సిన్ కోసం ఎంత చేస్తున్నారో తెలుసా ?

కరోనా వ్యాక్సిన్ కోసం ఎంత చేస్తున్నారో తెలుసా ?

కరోనా టీకా డ్రైరన్ సందర్బంగా సాఫ్ట్ వేర్ డేటా ఎంట్రీ, మాక్ డ్రిల్, టీమ్ మేనేజ్ మెంట్, ప్లానింగ్, వ్యాక్సినేషన్లో సమస్యలు పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది, కరోనా టీకా ట్రాన్స్ పోర్ట్ నిర్వహణ, వ్యాక్సిన్ వేసే సిబ్బంది పనితీరును స్టడీ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

 ఇది కేంద్ర ప్రభుత్వం లెక్క

ఇది కేంద్ర ప్రభుత్వం లెక్క

కరోనా వ్యాక్సిన్ నిల్వచేసే కోల్డ్ స్టోరేజీలు, ట్రాన్స్ పోర్టు పనితీరును కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రతి రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆసుపత్రులు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, అర్బన్ ప్రాంతాలు, ప్రైవేట్ ఆసుపత్రులు, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహణకోసం ఇప్పటికే ఎంచుకున్నారు. ప్రతిరాష్ట్రంలో జిల్లా స్థాయిలో మాక్ డ్రిల్ అంచనా వేసి ఆ డేటాను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి అందించాలని అధికారులు అంచనా వేశారు.

 సైకిల్ లో తాఫీగా కరోనా వ్యాక్సిన్

సైకిల్ లో తాఫీగా కరోనా వ్యాక్సిన్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏదో ఒక విధంగా ప్రతిరోజూ వార్తలో ఉంటోంది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలోని చౌకాఘాట్ మహిళా ఆసుపత్రికి కరోనా టీకా వ్యాక్సిన్ ను సైకిల్ మీద తీసుకెళ్లడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రచర్చకు దారితీసింది. కరోనా వ్యాక్సిన్ సైకిల్ మీద తరలించడం వివాదానికి దారితీసింది.

 ఎందుకు అలా చేశారంటే ?

ఎందుకు అలా చేశారంటే ?

ఈ విషయంపై వారణాసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీబీ. సింగ్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలకు వ్యాన్ లలో కరోనా టీకా వ్యాక్సిన్ తరలించామని, ఒక్క చౌకాఘాట్ మహిళా ఆసుపత్రికి మాత్రమే సైకిల్ మీద తరలించామని వివరణ ఇచ్చారు. మీ దగ్గర కరోనా వ్యాక్సిన్ టీకా తరలించడానికి వాహనాలు లేకపోవడం వలనే సైకిల్ మీద తరలించారా ? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అని మీడియా ప్రశ్నించగా డాక్టర్ వీబీ, సింగ్ సరైన సమాధానం చెప్పడం లేదని స్థానిక మీడియా ఆరోపిస్తోంది.

 సైకిల్ మీద కరోనా వ్యాక్సిన్... పక్కన గన్ మ్యాన్ లు.... సూపర్

సైకిల్ మీద కరోనా వ్యాక్సిన్... పక్కన గన్ మ్యాన్ లు.... సూపర్

వారణాసిలోని చౌకాఘాట్ మహిళా ఆసుపత్రికి రెండు బాక్స్ ల్లో కరోనా టీకా వ్యాక్సిన్ లు తీసుకుని సైకిల్ హ్యాండిల్ కు రెండు వైపులా తగిలించుకుని తాఫీగా తొక్కుకుంటూ ఓ వ్యక్తి వెలుతుంటే పక్కన పోలీసులు తుపాకులు చేతపట్టుకుని భద్రతగా వెలుతున్న సమయంలో ఫోటోలు తియ్యడంతో అవి వైరల్ అయ్యాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కాపాడటానికి కరోనా వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం అని ఎదురు చూస్తున్న ప్రజలు మాత్రం సైకిల్ మీద ఎందుకు కరోనా టీకా వ్యాక్సిన్ తరలించారు అనే ప్రజల ప్రశ్నకు సమాధానం మాత్రం అంతుచిక్కడం లేదు.

 అంతా ఓకే ఫ్రెండ్స్

అంతా ఓకే ఫ్రెండ్స్

గత సోమవారం (జనవరి 4వ తేదీ) ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా టీకా డ్రైరన్ కార్యక్రమం మొదలైయ్యింది. ఉత్తరప్రదేశ్ లో ప్రజలకు కరోనా టీకా అందించడానికి మా రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రయత్నించారు. అయితే సైకిల్ మీద కరోనా టీకా వ్యాక్సిన్ ఎందుకు తరలించారు అంటే ఉత్తరప్రదేశ్ వైద్యశాఖ అధికారుల దగ్గర సరైన సమాధానం మాత్రం రావడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

English summary
COVID Vaccine: Covid-19 vaccine reaches varanasi hospital on bicycle raises questions on COVID vaccination system in Uttar Pradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X