వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ 19 వాట్సప్ గ్రూప్.. చైనా టార్గెట్ గా నెటిజన్ల ఫైర్ ... వర్మ ట్వీట్ వైరల్

|
Google Oneindia TeluguNews

డ్రాగన్ కంట్రీ అయిన చైనాలోని వుహన్‌లో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది . అగ్రరాజ్యం అమెరికాను సైతం భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో లక్షకు పైగా కేసులు నమోదు కాగా ఇటు భారత్ సైతం కరోనాకు వనుకుతుంది. ఇటలీ కరోనా కంట్రోల్ లో ఫెయిల్ అయ్యింది. కరోనా వైరస్ ముందు సరెండర్ అయింది . ఇక ఇదంతా చైనా కుట్ర అని చెప్తున్న పరిస్థితి ఉంది .

 కరోనా వైరస్ చైనా కుట్ర అంటున్న ప్రపంచ దేశాల ప్రజలు

కరోనా వైరస్ చైనా కుట్ర అంటున్న ప్రపంచ దేశాల ప్రజలు

కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన చైనాలో ఇప్పుడు పూర్తిగా తగ్గిపోవడం ఇతర దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఇదంతా చైనా కుట్ర అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఇప్పటికే ప్రపంచ దేశాల్లో చాలామంది ఈ కోవిడ్ 19ను చైనా సృష్టించిందని అంటున్న పరిస్థితి ఉంది . బయో వార్‌లో భాగంగా చైనా ఈ వైరస్ ను పుట్టించిందని అనేక విమర్శలు సైతం వినిపిస్తున్న పరిస్థితి . స్వయంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సైతం దీన్ని చైనీస్ వైరస్ అంటూ విమర్శలు గుప్పించిన సందర్భాలు లేకపోలేదు. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లను కుదేలు చేస్తున్న ఈ వైరస్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

చైనా వల్లే ఇదంతా అని తెలియజేసే పోస్ట్ చేసిన రాం గోపాల్ వర్మ

చైనా వల్లే ఇదంతా అని తెలియజేసే పోస్ట్ చేసిన రాం గోపాల్ వర్మ


మీమ్స్ , టిక్ టాక్ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఎవరికి వారు తమ క్రియేటివిటీని జోడించి సృజనత్మకతంగా చైనాపై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు కరోనా వైరస్ పై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మొదటి నుండి తనదైన స్టైల్ లో సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో కరోనా వైరస్ పై ఆసక్తికరమైన పోస్ట్ పెట్టి చర్చకు కారణం అయ్యారు. ఆ పోస్ట్ లో ఆయన ఒక స్క్రీన్ షాట్ పెట్టారు.

 కోవిడ్ 19 వాట్సప్ గ్రూప్ .. క్రియేట్ చైనా అన్ని దేశాలను యాడ్ చేసి క్విట్ అయిన పోస్ట్

కోవిడ్ 19 వాట్సప్ గ్రూప్ .. క్రియేట్ చైనా అన్ని దేశాలను యాడ్ చేసి క్విట్ అయిన పోస్ట్

అందులో ఇటీవల చైనా ‘కోవిడ్ 19' అనే గ్రూప్ ను క్రియేట్ చేసి అందులో ప్రపంచం మొత్తాన్ని యాడ్ చేసి తను ఎగ్జిట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పోస్టు వైరల్ అవుతుండగా నెటిజన్లు చైనా కుట్రపై విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికా టార్గెట్‌గా కరోనా వైరస్‌ని సృష్టించిందనీ, అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనమే చైనా లక్ష్యమనీ కొందరు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఇందుకు వారు కొన్ని బలమైన కారణాలు ఆధారాలుగా చెబుతున్నారు. కరోనా వైరస్ విషయంలో చైనా చాలా అంశాలు దాచి పెట్టిందని , కావాలని ప్రపంచ విపత్తుగా దీనిని చైనా మార్చిందని అంటున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా సాగుతున్న చర్చలో వాస్తవాల మాట అటుంచితే చైనా పై మాత్రం జోరుగా ఆరోపణలు చేస్తున్నారు ప్రపంచ దేశాల ప్రజలు .

English summary
All this is attributed to China's conspiracy, as the coronavirus is now the epidemic in China, where it is now spreading rapidly to other countries. Recently, China has created a group called Kovid 19mod, in which the whole world is added and exited china . Now that Varma's post is going viral, netizens are criticizing the Chinese conspiracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X