వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: డాక్టర్ భార్యకు కరోనా, దేశంలో తొలి కరోనా కాన్ఫు, పండంటి మగ బిడ్డ, ఇద్దరూ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) వ్యాధి తాండవం చేస్తోంది. భారతదేశంలో కరోనాను అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. కరోనా వైరస్ వ్యాధి రోగులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి ఆ వ్యాధి సోకుతోంది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా వైరస్ వ్యాధి రోగులకు చికిత్స అందించిన వైద్యుడికి, ఆయన భార్యకు ఆ వ్యాధి సోకింది. కరోనా వైరస్ సోకిన వైద్యుడి భార్య ఇప్పుడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కరోనా వైరస్ వ్యాధి సోకిన మహిళా బిడ్డకు జన్మనిచ్చిన మొదటి కేసు ఢిల్లీలో ఎయిమ్స్ లో నమోదైయ్యింది.

Lockdown దెబ్బ: అర్ధరాత్రి సిగరెట్ కోసం 12 కిలోమీటర్లు రౌండ్, పోలీసులనే అడిగితే?, అంతే!Lockdown దెబ్బ: అర్ధరాత్రి సిగరెట్ కోసం 12 కిలోమీటర్లు రౌండ్, పోలీసులనే అడిగితే?, అంతే!

 ఎయిమ్స్ వైద్యుడు

ఎయిమ్స్ వైద్యుడు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతం హాట్ స్పాట్ అయ్యింది. ఢిల్లీలో కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాధి అనుమానితుల సంఖ్య వేలలో ఉంది. ఇదే సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలోని వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

 వైద్య దంపతులకు కరోనా వైరస్

వైద్య దంపతులకు కరోనా వైరస్

ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో రెసిడెంట్ డాక్టర్ గా పని చేస్తున్న వైద్యుడు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ఆ వ్యాధి సోకింది. ఆ వైద్యుడి భార్య (29)కి కరోనా వైరస్ సోకింది. వైద్యుడి భార్యకు కరోనా వైరస్ సోకిన సమయంలో ఆమె 9 నెలల నిండు గర్బిణి. కరనా వైరస్ సోకిన తరువాత ఎయిమ్స్ లోని ప్రత్యేక విభాగంలోని ఐసోలేషన్ వార్డులో వైద్యుడికి, ఆయన భార్యకు 10 మంది ప్రత్యేక వైద్య బృందం ప్రత్యేక చికిత్స అందించారు.

 వారం ముందే కాన్ఫు

వారం ముందే కాన్ఫు

కరోనా వైరస్ సోకిన మహిళకు ‘సి' సెక్షన్ ద్వారా వారం ముందే ఆమెకు కాన్ఫు చేశామని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాధి ముదిరిపోక ముందే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.ఎయిమ్స్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డును ఆపరేషన్ థియేటర్ గా మార్చేశారు.

Recommended Video

PM Urges People To Light Diyas For 9 Minutes On April 5 At 9 PM
 ఆపరేషన్ వార్డులో చికిత్స

ఆపరేషన్ వార్డులో చికిత్స

కరోనా వైరస్ సోకిన వైద్యురాలు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారని, ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఎయిమ్స్ ఆసుపత్రిలోని ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ లో తల్లి, బిడ్డకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కరోనా వైరస్ సోకినా తల్లి దగ్గర పాలు తాగిన బిడ్డకు ఆ వైరస్ వ్యాపించదని డాక్టర్లు అంటున్నారు. అందుకే తల్లి, బిడ్డకు ఒకే చోట చికిత్స అందిస్తున్నారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. కరోనా వైరస్ సోకిన మహిళ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన దేశంలో ఇదే తొలిసారి అని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

English summary
COVID 19: Amid the Coronavirus pandemic, doctors at AIIMS ended their day on an upbeat note as a nine-month pregnant COVID-19 patient gave birth to a healthy baby boy Friday evening at the institute in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X