వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ : ఆ సమస్యతో బాధపడేవారిలో కోవిడ్ 19 డెత్ రేటు 10 రెట్లు ఎక్కువ...

|
Google Oneindia TeluguNews

కరోనా వ్యాధికి సంబంధించి షాకింగ్ విషయం ఒకటి వెలుగుచూసింది. అధిక బరువు కలిగిన వ్యక్తుల జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో కోవిడ్ 19 మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే అధిక బరువుతో బాధపడే పెద్దల్లో మరణాల రేటు 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నిర్దారణ అయింది. ఏ దేశాల్లోనైతే సగానికి పైగా పెద్దల జనాభా అధిక బరువుతో బాధపడుతున్నారో... ఆయా దేశాల్లో 2020 చివరి నాటికి కోవిడ్ 19 మరణాల రేటు 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ రిపోర్ట్...

వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ రిపోర్ట్...

అమెరికాలోని జాన్ హోప్‌కిన్స్ యూనివర్సిటీ(జేహెచ్‌యూ),వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ)ల నుంచి సేకరించిన డేటాను పరిశీలించి ఈ విషయాలను నిర్దారించినట్లు వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ తమ నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి కరోనా కారణంగా సంభవించిన 2.5 మిలియన్ల మరణాల్లో 2.2 మిలియన్ల మరణాలు అధిక బరువు కలిగిన వ్యక్తుల జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లోనే సంభవించాయని తెలిపింది.

ఆ దేశాల్లో తక్కువ డెత్ రేటు...

ఆ దేశాల్లో తక్కువ డెత్ రేటు...


మొత్తం 160 దేశాల్లో మరణాల రేటుకు సంబంధించిన డేటాను పరిశీలించగా... సగానికి పైగా జనాభా అధిక బరువు,స్థూలకాయంతో బాధపడే దేశాల్లోనే మరణాల రేటు పెరిగినట్లు వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ గుర్తించింది. ఏ దేశాల్లోన్నైతే అధిక బరువు కలిగిన వ్యక్తుల జనాభా 40శాతం కన్నా తక్కువగా ఉందో అక్కడ మరణాల రేటు తక్కువగా ఉందని నిర్దారించింది.ఇందులో వియత్నాం,జపాన్,థాయిలాండ్,సౌత్ కొరియా వంటి దేశాలున్నాయి.

వియత్నాంలో అతి తక్కువ మరణాలు...

వియత్నాంలో అతి తక్కువ మరణాలు...

కోవిడ్ 19 మరణాల్లో ప్రపంచంలోనే వియత్నాంలో అతి తక్కువ డెత్ రేటు ఉన్నట్లు వెల్లడైంది. ఆ దేశంలో సగటున లక్ష జనాభాకు కేవలం 0.04 డెత్ రేటు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఇక అగ్రరాజ్యం అమెరికా డెత్ రేటు విషయంలో టాప్‌లో ఉంది. సగటున లక్ష జనాభాకు ఇక్కడ 152.49 డెత్ రేటు నమోదైంది. 'వృద్దాప్యాన్ని మనం ఏమీ చేయలేం. కానీ అధిక బరువు,స్థూలకాయాన్ని నివారించగలం. ఇందుకోసం ప్రభుత్వాలు,సమాజం అంతా కలిసి కృషి చేస్తే కోవిడ్ 19 ముప్పును తగ్గించగలం.' అని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ సీఈవో జొహన్నా రాల్‌స్తోన్ తెలిపారు. గత దశాబ్ద కాలంలో చాలావరకు ప్రభుత్వాలు ఒబేసిటీని నియంత్రించడంలో విఫలమయ్యాయని అన్నారు.

English summary
The risk of death from Covid-19 is about 10 times higher in countries where most of the population is overweight, according to a report released Wednesday by the World Obesity Federation. Researchers found that by the end of 2020, global Covid-19 death rates were more than 10 times higher in countries where more than half the adults are overweight, compared to countries where fewer than half are overweight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X