
డేంజర్ బెల్స్ మ్రోగిస్తున్న కరోనాకేసులు; తాజాగా 7,584 కేసులు; రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నియంత్రణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని మరియు తగిన పరీక్షల ద్వారా వైరస్ వ్యాప్తిపై నిఘా ఉంచాలని రాష్ట్రాలను కోరింది.

దేశంలో తాజాగా 7584 కరోనా కేసులు ..
ఇక
వరుసగా
రెండో
రోజు
కూడా
దేశంలో
కరోనా
కేసులు
భారీగా
నమోదయ్యాయి.
ఏడు
వేలకు
మించి
కేసులతో
దేశంలో
కరోనా
వ్యాప్తికి
కొనసాగుతుంది.
క్రియాశీల
కేసులలో
దాదాపు
నాలుగు
వేల
మేర
పెరిగి
36వేలకు
చేరాయి.
శుక్రవారం
కేంద్ర
ఆరోగ్య
శాఖ
విడుదల
చేసిన
గణాంకాల
ప్రకారం
గత
24
గంటల్లో
3.35
లక్షల
మందికి
కరోనా
నిర్ధారణ
పరీక్షలు
నిర్వహించగా
7,584
మంది
మహమ్మారి
బారిన
పడినట్లుగా
నిర్ధారణ
అయింది.
మునుపటి
రోజుతో
పోలిస్తే
300
మేర
కరోనా
కేసులు
పెరిగాయి.

ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్న కరోనా పాజిటివిటీ రేటు
ఇక కరోనా పాజిటివిటీ రేటు 2.26 శాతానికి చేరి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న క్రియాశీల కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలు మొత్తం కేసులలో మూడు వంతులకు పైగా కేసులను నమోదు చేస్తున్నాయి. మహారాష్ట్రలో 2813 కరోనా కేసులు, కేరళలో 2193 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 24 మరణాలు సంభవించాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. మొత్తంగా ఇప్పటివరకు 5.24 లక్షల మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కేంద్రం
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు రాసిన లేఖలో, జూన్ 8తో ముగిసిన వారంలో దేశంలో రోజువారీ సగటు కేసుల సంఖ్య 4,207కి పెరిగిందని, అంతకుముందు వారం 2,663 నుండి ఒక్కసారిగా పెరిగినట్టు హెచ్చరించారు. పరీక్ష సానుకూలత రేటు (TPR) కూడా పెరిగిందని పేర్కొన్నారు. జూన్ 8తో ముగిసిన వారంలో 0.63% నుండి 1.12%కి పాజిటివిటీ రేట్ పెరిగిందని లేఖ ద్వారా వెల్లడించారు.

మాస్కులు ధరించటం, సామాజిక దూరం పాటించటంపై సూచనలు
కేసులను ముందస్తుగా గుర్తించేందుకు తగిన పరీక్షలు నిర్వహించాలని, అలాగే వ్యాప్తి స్థాయికి సంబంధించి అన్ని వివరాలను కూడా కలిగి ఉండాలని భూషణ్ రాష్ట్రాలను కోరారు. ఒక మిలియన్‌కు నిర్వహించిన పరీక్షల సంఖ్యపై మాత్రమే కాకుండా, మరింత ఖచ్చితమైన ఆర్టీ పీసీఆర్ పరీక్షల నిష్పత్తిపై కూడా దృష్టి సారించాలని ఆయన వారిని కోరారు. సామాజిక దూర నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు.