వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాపై చర్చిస్తాం: గవర్నర్‌కు లేఖలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ట్విస్ట్

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్ రాజకీయం మలుపులు తిరుగుతోంది. నిన్నమొన్నటి వరకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పట్టుబట్టారు. అయితే, తాజాగా, ఆయన మరో ట్విస్టిచ్చారు. ఆదివారం గవర్నర్‌కు రాసిన లేఖలో జులై 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అందులో పేర్కొన్నారు.

అర్ధరాత్రి కేబినెట్... గవర్నర్ 6 ప్రశ్నలపై గెహ్లాట్ చర్చలు... రసకందాయంలో రాజస్తాన్ సంక్షోభంఅర్ధరాత్రి కేబినెట్... గవర్నర్ 6 ప్రశ్నలపై గెహ్లాట్ చర్చలు... రసకందాయంలో రాజస్తాన్ సంక్షోభం

కరోనా నియంత్రణ, పరీక్షలు సహా వివిధ అంశాలపై చర్చించాలని అజెండాలో చేర్చారు. అయితే, అందులో బలపరీక్ష అంశం మాత్రం పొందుపర్చలేదు. దీనిపై గవర్నర్ ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. సోమవారం సాయంత్రానికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 Covid discussion, introduction of bills: No mention of floor test in Rajasthan CMs new proposal to Governor

గవర్నర్‌కు సమర్పించిన లేఖలో బలపరీక్ష లేకపోవడంపై సచిన్ పైలట్ వర్గం
అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కాగా, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో క్యాబినెట్ సమావేశమైంది. అనంతరం అజెండాను తయారుచేసిన క్యాబినెట్ దీనిని గవర్నర్‌కు పంపించారు.

అయితే ఎందుకు ఇలా చేశారన్నది మాత్రం కాంగ్రెస్ శ్రేణులకు అంతుబట్టడం లేదు. వ్యూహంలో భాగంగానే సీఎం అశోక్ గెహ్లాట్ కొత్త ఎత్తుగడ వేశారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఇప్పటికే మూడు సార్లు కల్‌రాజ్‌మిశ్రాతో భేటీ అయిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో‌ బలనిరూపణకు డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

English summary
Covid discussion, introduction of bills: No mention of floor test in Rajasthan CM's third proposal to Governor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X