వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పూత్నిక్-వి వ్యాక్సిన్: అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరాలో భారత్ భాగస్వామ్యం..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కోసం తొలి వ్యాక్సిన్‌ రష్యా కనుగొన్న సంగతి తెలిసిందే. స్పూత్నిక్-వి వ్యాక్సిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ కూతురు సహా పలువురికి ఇచ్చారు. అయితే వ్యాక్సిన్ సరఫరా, అభివృద్ధిలో భాగస్వామ్యం, భారత్‌తో కలిసి ఉత్పత్తి చేయాలని రష్యా భావిస్తోంది. ఈ మేరకు రష్యా అంబాసిడర్ నికోలాయ్ కుడాషేవ్ తెలిపారు. స్పూత్నిక్-వి వ్యాక్సిన్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని లాన్సెట్ స్టడీ పేర్కొన్నది.

Recommended Video

Widespread Covid-19 Vaccines Not Expected Until Mid-2021 : WHO || Oneindia Telugu

స్పూత్నిక్-వి వ్యాక్సిన్‌కి సంబంధించి భారత్‌తో రష్యా సహకారానికి సంబంధించి చర్చలు జరిపిందని, దీనికి సంబంధించిన వివరాలను భారత ప్రభుత్వం వెల్లడించబోతుందని నికోలాయ్ తెలిపారు. సాంకేతిక దశల తర్వాత.. విదేశాల్లో కూడా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని నికోలాయ్ వెల్లడించారు. ఈ వారం విదేశాంగ మంత్రి జై శంకర్ మాస్కో పర్యటన సందర్భంగా ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది.

Covid-hit India mulls a shot at Sputnik V..

సరిహద్దులో చైనా దూసుకొస్తున్న క్రమంలో ఇండో పసిఫిక్ క్వాడ్ విధానాలపై రెండో మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామని ఇదివరకే ప్రకటించింది. అండమాన్ దీవుల్లో జపాన్‌తో భారత్ చర్చలు జరిపింది. అయితే మాస్కో మాత్రం ఇండో పసిఫిక్ విధానాలపై కాస్త అసంతృప్తిగానే ఉంది. కానీ డ్రాగన్ చర్యలపై మాత్రం రష్యా.. ఇతర దేశాలకు వివరించి మద్దతు కూడగట్టేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే రష్యా కూడా నిర్మాణాత్మక విధానంతో భారత్‌కు అండగా నిలుస్తోందని నికోలావ్ పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
Covid-19 cases continue to mount in India, Russian ambassador Nikolay Kudashev has said Moscow is talking to the Indian government “on different levels”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X