• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్: కొవిడ్‌ రోగులకు black fungus -మరో మహహ్మారి విజృంభణ -పెరిగిన మ్యూకర్‌మైకోసిస్‌ కేసులు

|

దేశంలో కరోనా వైరస్ విలయానికి మరో మహమ్మారి 'బ్లాక్ ఫంగస్' కూడా తోడైంది. కొవిడ్ వ్యాధికి గురై, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వారిలో 'బ్లాక్ ఫంగస్' లక్షణాలు కనిపిస్తున్నాయి. 50 శాతం మరణాల రేటు కలిగిన ఈ బ్లాక్ ఫంగస్ కేసులు నాలుగు నెలల తర్వాత మళ్లీ విజృంభిస్తున్నాయి. గత డిసెంబర్ లో ఢిల్లీ, గుజరాత్ లో బ్లాక్ ఫంగస్ కాటుకు పదుల సంఖ్యలో రోగులు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే ఆరు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదుకావడం ఆందోళనకరంగా మారింది..

  Covid-Induced 'Black Fungus' పెరిగిన Mucormycosis కేసులు.. ఏమిటీ బ్లాక్ ఫంగస్? || Oneindia Telugu

  viral video: సర్జరీ తర్వాత స్టైల్ మార్చిన ఎమ్మెల్యే రోజా -చెన్నై నుంచే నగరికి ఆదేశాలు -ఇలాగైతే మార్పు కష్టంviral video: సర్జరీ తర్వాత స్టైల్ మార్చిన ఎమ్మెల్యే రోజా -చెన్నై నుంచే నగరికి ఆదేశాలు -ఇలాగైతే మార్పు కష్టం

  ఏమిటీ బ్లాక్ ఫంగస్?

  ఏమిటీ బ్లాక్ ఫంగస్?

  డాక్టర్లు, సైంటిస్టులు ‘బ్లాక్ ఫంగల్'గా పిలిచే మ్యూకర్‌మైకోసిస్‌ ఒక అరుదైన, ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. మ్యూకర్మోసైట్స్‌ మోల్డ్స్‌(అచ్చులు) కారణంగా కలిగే వ్యాధి కావడంతో దీన్ని మ్యూకర్‌మైకోసిస్‌ అని పిలుస్తారు. ఈ ఇన్ఫెక్షన్‌ ముక్కు నుంచి ప్రారంభమై కళ్లకు వ్యాపిస్తుంది. కంటి చుట్టూ ఉండే కండరాలను స్తంభింపజేసి.. అంధత్వానికి దారితీస్తుంది. ఇన్ఫెక్షన్‌ మెదడుకు పాకితే మెనింజైటి్‌స(మజ్జ రోగం)కు దారితీస్తుందని నిపుణులు పేర్కొంటారు. ప్రారంభదశలోనే బ్లాక్ ఫంగస్ ను గుర్తించకుంటే ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఎందుకంటే దీని డెత్ రేటు 50 శాతం. అంటే, బ్లాక్ ఫంగస్ సోకితే ప్రతి ఇద్దరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయే అవకాశముంది. తాజాగా ఢిల్లీలో ఈ కేసులు పెరుగుతున్నాయి..

  రెండు రోజుల్లో ఆరుగురికి..

  రెండు రోజుల్లో ఆరుగురికి..

  కొవిడ్19 ప్రేరిత ప్రమాదకర బ్లాక్ ఫంగల్ కేసుల పెరుగుదలపై గంగారామ్ ఆస్పత్రి సీనియర్ సర్జన్ మనీశ్ ముంజాల్ మీడియాకు బులిటెన్ విడుదల చేశారు. గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే ఆరు మ్యూకర్‌మైకోసిస్‌ కేసులు నమోదైనట్లు తెలిపారు. గతేడాది చివర్లో బ్లాక్ ఫంగస్ బారినపడి ఢిల్లీ, అహ్మదాబాద్ లో పదుల సంఖ్యలో రోగులు చనిపోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నాలుగు నెలల గ్యాప్ తర్వాత మ్యూకర్‌మైకోసిస్‌ కేసులు మళ్లీ పెరగడానికి కారణాలను గంగారామ్ ఆస్పత్రి ఈఎన్టీ విభాగం అధిపతి అజయ్ స్వరూప్ వివరించారిలా..

  oxygen:జగన్ సంచలనం, కేంద్రం నో -ప్రైవేటు ఆస్పత్రులకు మరో ఝలక్ -ఏపీలో ఫీవర్‌ సర్వే షురూoxygen:జగన్ సంచలనం, కేంద్రం నో -ప్రైవేటు ఆస్పత్రులకు మరో ఝలక్ -ఏపీలో ఫీవర్‌ సర్వే షురూ

  కొవిడ్‌తోపాటు ఇతర రోగాలుంటే..

  కొవిడ్‌తోపాటు ఇతర రోగాలుంటే..

  ‘‘బలహీనమైన రోగ నిరోధకవ్వస్థ ఉండి, కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నవారిలో సాధారణంగా ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది. అయితే, షుగర్, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులున్నవారిలో దీని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చు. అదీగాక కరోనా చికిత్సలో స్టెరాయిడ్లు వాడుతుండటం, వాళ్లలో చాలా మంది డయాబెటిస్ రోగులు కూడా కావడం మళ్లీ బ్లాక్ ఫంగస్ కేసుల పెరుగుదలకు కారణం కావొచ్చు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న కొవిడ్ రోగులకు బ్లాక్ ఫంగస్ సంక్రమించే అవకాశాలు ఎక్కువ'' అని డాక్టర్ స్వరూప్ వివరించారు. కరోనా నుంచి బయటపటిన తర్వాత కూడా తలనొప్పి, ముక్కులో సమస్యలు, శ్వాస సమస్యలు, కళ్లు ఎర్రగా మారి దురద పెడుతుంటే వారు వెంటనే డాక్టర్‌ని కలవాల్సి ఉంటుందని, బ్లాక్ ఫంగస్ ఒకరి నుంచి మరొకరికి సోకే ఇన్ఫెక్షన్ కాదని డాక్టర్లు చెబుతున్నారు.

  English summary
  Doctors at a private facility in Delhi are seeing a rise in the number of Covid-triggered mucormycisis cases, according to a statement from the hospital. Mucormycisis is a fungal infection triggered by Covid-19. Black fungus or mucormycosis has been a cause of disease and death of patients in transplants, ICUs and immunodeficient patients since long. According to Dr Manish Munjal, senior ENT surgeon at the Sir Ganga Ram Hospital, "We are seeing a rise again in this dangerous fungal infection triggered by Covid-19. In the last two days, we have admitted six cases of mucormycisis.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X