• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా విలయం: అనూహ్య వివాదం -లాక్‌డౌన్‌కు హైకోర్టు ఆదేశం, కుదరదన్న యోగి సర్కార్ -తెలంగాణలో అదే సీన్!

|

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ ప్రభావం భయానకంగా కొనసాగుతూ, లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతుండగా, వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే విషయంలో అనూహ్య వివాదాలు తెరపైకి వచ్చాయి. కొవిడ్ ఉధృతి తారా స్థాయికి చేరినా లాక్‌డౌన్ ఎందుకు విధించడంలేదంటూ ప్రభుత్వాలపై న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, గతేడాది లాక్‌డౌన్ దుష్టాంతాల నేపథ్యంలో ఈసారి ఆ నిర్ణయం ఉండబోదని ప్రభుత్వాలు కుండబద్దులు కొట్టేశాయి. ఈ క్రమంలో వ్యవహారం కోర్టులు వర్సెస్ ప్రభుత్వాలు అన్నట్లుగా తయారైంది..

కామసూత్ర, కొరియర్ బాయ్ -జగన్ బాబాయిపై రఘురామ సంచలనం -నర్సాపురంలో ఉపఎన్నిక, షాక్కామసూత్ర, కొరియర్ బాయ్ -జగన్ బాబాయిపై రఘురామ సంచలనం -నర్సాపురంలో ఉపఎన్నిక, షాక్

అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం కొవిడ్ సెకండ్ వేవ్ బలంగా కనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 28,211 కొత్త కేసులు, 167 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 8,79,831కి, మరణాలు 9,997కు పెరిగాయి. పరిస్థితి దారుణంగా మారినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, ప్రజల ప్రాణాల విషయంలో బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నదని అలహాబాద హైకోర్టు వ్యాఖ్యానించింది. యోగి సర్కార్ వైఫల్యాలను ప్రస్తావిస్తూ, స్వయంగా హైకోర్టే ఐదు నగరాల్లో లాక్‌డౌన్ విధింపునకు ఆదేశాలు జారీ చేసింది. కానీ..

covid surge in up:Allahabad HC orders lockdown in 5 cities, but Yogi govt says cant do it

కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రయాగ్‌రాజ్, లక్నో, వారణాసి, కాన్పూర్ నగర్, గోరఖ్‌పూర్ సహా నగరాల్లో ఏప్రిల్ 26 వరకు లాక్‌డౌన్ విధిస్తూ అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులివ్వగా యోగి సర్కార్ అనూహ్య రియాక్షన్ ఇచ్చింది. ఆ ఐదు నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేయలేమంటూ హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినంత పనిచేసింది. లాక్‌డౌన్ విధించలేమని, కఠిన ఆంక్షలు అమలు చేస్తామని కోర్టుకు సమధానం సమర్పించినట్టు సమాచార, ప్రజాసంబంధాల శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ నవనీన్ సెహ్‌గల్ తెలిపారు. లాక్ డౌన కుదరదన్న యోగి సర్కార్ నిర్ణయంపై హైకోర్టు స్పందించాల్సి ఉంది. కాగా,

వ్యాక్సిన్ల కొరత: నిద్ర లేచిన కేంద్రం -సీరం సంస్థకు రూ.3వేల కోట్లు, భారత్ బయోటెక్‌కు రూ.1500కోట్లు అప్పు, కానీవ్యాక్సిన్ల కొరత: నిద్ర లేచిన కేంద్రం -సీరం సంస్థకు రూ.3వేల కోట్లు, భారత్ బయోటెక్‌కు రూ.1500కోట్లు అప్పు, కానీ

  COVID-19 Predominantly Spreads Through Air - Lancet Study || Oneindia Telugu

  ఉత్తరప్రదేశ్ లో లాక్ డౌన్ విధింపుపై అలహాబాద్ హైకోర్టు, యోగి సర్కారు మధ్య వివాదం నడుస్తుండగానే, ఇటు తెలంగాణలోనూ అలాంటి దృశ్యాలే చోటుచేసుకున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణలోని బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, ర్యాలీలు, వివాహాలపై ఆంక్షలు విధించాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 48 గంటల్లో కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్ గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే తామే ఆదేశాలు ఇస్తామన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 22 తేదీకి వాయిదా వేసింది. 'ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి లాక్ డౌన్ ఉండదు'అని సీఎం కేసీఆర్ బల్లగుద్ది చెప్పిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వ స్పందన కీలకంగా మారింది.

  English summary
  Emphasising that the livelihood of the poor needs to be saved, the Yogi Adityanath-led Uttar Pradesh government has refused to impose the lockdown ordered by the Allahabad High Court in five cities of the state. The Allahabad High Court on Monday ordered a lockdown in five cities of UP till April 26, considering the prevailing Covid-19 situation. The lockdown was ordered in Lucknow, Prayagraj, Varanasi, Kanpur and Gorakhpur.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X