కోవిన్ 20 యాప్ .. వ్యాక్సిన్ డ్రైవ్ కోసం అభివృద్ధి చేస్తున్న కేంద్రం.. యాప్ ఫీచర్స్ ఇలా !!
కరోనా వ్యాక్సిన్ ల క్లినికల్ ట్రయల్స్ తుది దశకు చేరుకున్న వేళ వ్యాక్సిన్ పంపిణీపై ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది కేంద్రం. కరోనా వ్యాక్సిన్ ను ముందు ఫ్రంట్‌లైన్ వారియర్స్ గా పనిచేసిన ఆరోగ్య కార్యకర్తలకు ఇస్తామని, ఆ తర్వాతి వరుసలో వృద్ధులు, ఆపై వివిధ రోగాలతో బాధపడుతున్న వారు.. ఇలా ఓ క్రమ పద్ధతిలో వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం పేర్కొంది. ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కూడా భారతదేశంలోని పోస్టల్ వ్యవస్థ ను వాడుకుంటూ దేశవ్యాప్తంగా సమర్థవంతంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు భారత దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం కోవిన్ 20 మొబైల్ యాప్ ను కూడా అభివృద్ధి చేసే పనిలో ఉంది.
2020లో ఇప్పటివరకు కరోనా కేసులే లేని పర్యాటక ప్రాంతం .. కరోనా .. అదేంటి? అని అడుగుతున్నారట !!

ఆరోగ్య సేతు తరహాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీలో డిజిటల్ యాప్ అభివృద్ధి
ఈ సంవత్సరం ప్రారంభంలో కరోనా మహమ్మారి భారతీయుల ఆరోగ్య సమస్యగా మారినప్పుడు, కేసులను గుర్తించడం కోసం ప్రభుత్వం ఆరోగ్య సేతు మొబైల్ యాప్ ను తీసుకు వచ్చింది.
ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో, ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ పంపిణీలో కూడా మొబైల్ యాప్ ని అభివృద్ధి చేయడంపై భారతదేశం దృష్టిసారించింది. కోవిన్ -20 పేరుతో కోవిడ్ -19 వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ప్రభుత్వం ఈ మొబైల్ యాప్ ను తీసుకురానుంది.

వ్యాక్సినేషన్ ట్రాకింగ్ , వ్యాక్సిన్ కోసం దరఖాస్తుల కోసం యాప్
కోవిడ్ 19 నిర్మూలన కోసం వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి గో-టు యాప్ గా కోవిన్ -20 ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తుంది . కోవిన్ -20 టీకా కార్యక్రమాన్ని ట్రాక్ చేయడంలో ఏజెన్సీలకు సహాయపడటంతో పాటు, కోవిడ్ -19 వ్యాక్సిన్ మోతాదుల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కోవిన్ -20 యాప్ యొక్క ప్రాధమిక లక్ష్యం భారతీయ పౌరులందరికీ వ్యాక్సిన్ అందించడం అని ప్రభుత్వం తెలిపింది.

టీకా డ్రైవ్‌ను సులభతరం చేయడంలో కోవిన్ -20 యాప్ కీలక పాత్ర
టీకా కార్యక్రమం గురించి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ కోవిడ్ -19 వ్యాక్సిన్ డెలివరీ కార్యక్రమానికి కో-విన్ ఒక సమర్థవంతమైన డిజిటల్ వేదిక అని ఆయన అన్నారు. ఈ మొబైల్ యాప్ ద్వారా వ్యాక్సిన్ డేటాను రికార్డ్ చేస్తామని చెప్పుకొచ్చారు. టీకా డ్రైవ్‌ను సులభతరం చేయడంలో కోవిన్ -20 యాప్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు
. కోవిన్ - 20 యాప్ కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి , వ్యాక్సినేషన్ ను ఈజీగా ట్రాక్ చేయడానికి ఐదు మాడ్యూల్స్‌గా విభజించబడింది. ఇవి అడ్మినిస్ట్రేటర్ మాడ్యూల్, రిజిస్ట్రేషన్ మాడ్యూల్, టీకా మాడ్యూల్, లబ్ధిదారుల రసీదు మాడ్యూల్ మరియు రిపోర్ట్ మాడ్యూల్ లలో ఇది అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది.

సామాన్యులు వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకునేలా సౌకర్యం
సామాన్య ప్రజానీకం కోసం కోవిన్ -20 యొక్క రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలు కాని వారు కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం కోవిన్ -20 యాప్‌లో రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ద్వారా నమోదు చేసుకుంటే రిజిస్ట్రేషన్ పూర్తయినప్పుడు, లబ్ధిదారుల రసీదు మాడ్యూల్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్ఎంఎస్ పంపుతుంది . ఆ ఎస్ఎంఎస్ ద్వారా కోవిడ్ -19 టీకా కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన అడ్మినిస్ట్రేటివ్ వ్యాక్సిన్ డెలివరీ చేయబడుతుంది.

వ్యాక్సినేషన్ కు సంబంధించిన డేటా అంతా కోవిన్ 20 యాప్ లో
కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా ప్రతి ప్రాంతానికి నిర్వాహకులు టీకాల సెషన్లను నిర్వహిస్తారు, దీని రికార్డు అడ్మినిస్ట్రేటివ్ మాడ్యూల్లో నిర్వహించబడుతుంది. స్థానిక అధికార స్థాయిలో సర్వేయర్లు వ్యాక్సినేషన్ తర్వాత ఆరోగ్యం మరియు ఇతర అనారోగ్య పరిస్థితులపై సర్వే నిర్వహిస్తారు. అంతేకాదు వ్యాక్సిన్ ఇచ్చిన వారి డేటా కోవిన్ -20 యాప్‌లో డేటా అప్లోడ్ చేయబడుతుంది, తద్వారా ఇది ఆరోగ్య అధికారులకు ప్రాధాన్యతను నిర్ణయించడానికి మరియు ఫాలో-అప్‌లో ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది.

ఇంకా అభివృద్ధి దశలో... అందుబాటులోకి రాని యాప్
టీకాలు వేసిన తర్వాత లబ్ధిదారుల రసీదు మాడ్యూల్ క్యూఆర్ ఆధారిత సర్టిఫికెట్‌ను కూడా జారీ చేస్తుంది. రిపోర్ట్ మాడ్యూల్ టీకా సెషన్లపై నివేదికలను సిద్ధం చేస్తుంది, తద్వారా ఒక ప్రాంతంలో మరియు జాతీయ స్థాయిలో కోవిడ్ -19 వ్యాక్సిన్ ల డేటా ఉంటుంది. కోవిన్ -20 యాప్ ద్వారా వ్యాక్సిన్లను నిల్వ చేసే కోల్డ్-స్టోరేజ్ సౌకర్యాల నుండి రియల్ టైమ్ డేటాను పంపుతుంది. ప్రస్తుతానికి కోవిన్ -20 యాప్ ఏ డిజిటల్ ప్లాట్ ఫాం లోనూ డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో లేదు. ఇది ఇంకా అభివృద్ధి దశలో ఉంది. కోవిడ్ 19 టీకా కార్యక్రమం కోసం కీలకమైన డిజిటల్ వేదికగా ఈ యాప్ ను మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈజీగా నిర్వహించడానికి ఈ యాప్ ఉపయోగపడేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు.