• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Covishield డోసుల వివాదం: విరామం పెంపు నిర్ణయం సరైందే, దీనిపై రాజకీయాలొద్దు: కేంద్రం క్లారిటీ

|

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటోన్న తరుణంలో కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధి పెంపుపై వివాదం పెద్దదవుతోంది. రెండు డోసుల మధ్య విరామాన్ని పెంచడం ద్వారా కరోనా వైరస్ మరింత బలబడే అవకాశముందని, సైంటిస్టులు వద్దంటున్నా కేంద్రం మొండిపట్టుదలతో ఈ నిర్ణయాన్ని తీసుకుందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వివాదంపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ వివరణ ఇచ్చుకున్నారు.

Etelaపై Jagan ఆగ్రహం -KCR బర్రెలు తినేవాడైతే నువ్వు గొర్రెలు తినే రకమంటూ -BJP, Modiపైనా ఫైర్Etelaపై Jagan ఆగ్రహం -KCR బర్రెలు తినేవాడైతే నువ్వు గొర్రెలు తినే రకమంటూ -BJP, Modiపైనా ఫైర్

సైంటిఫిక్ ఎవిడెన్స్ తో కూడిన డేటాను విశ్లేషించిన తర్వాతే కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచామని, ఇది పూర్తిగా పారదర్శకంగా తీసుకున్న నిర్ణయమని మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ''కొవిషీల్డ్‌ డోసుల వ్యవధి పెంపునకు సంబంధించి సైంటిఫిక్ ఆధారాలను విశ్లేషించడానికి భారత్‌కు చాలా పటిష్ఠమైన వ్యవస్థ ఉంది. ఇలాంటి ముఖ్యమైన విషయాలను రాజకీయం చేయడం దురదృష్టకరం'' అని మంత్రి బుధవారం ట్వీట్ చేశారు.

Covishield Dose Gap Controversy: Health Minister Harsh Vardhan Clarification

కొవిషీల్డ్‌ డోసుల వ్యవధిని 8-12 వారాలకు మాత్రమే పెంచాలని తాము సిఫార్సు చేశామని, కానీ 12-16 వారాలకు పెంచుతూ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుందని నేషనల్‌ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌(ఎన్‌టీఏజీఐ) సభ్యులు కొందరు చెప్పినట్లు మీడియాలో వార్తలు రావడంతో ఈ వివాదం మొదలైంది. వ్యాక్సిన్ల కొరత కారణంగానేకొవిషీల్డ్‌ డోసుల వ్యవధిని పెంచినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో కేంద్రం వివరణ ఇచ్చుకోకతప్పలేదు.

బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో TRS ఎంపీ నామాకు ED సమన్లు, 25న విచారణ, KCRపై కేంద్రం ఉచ్చు?బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో TRS ఎంపీ నామాకు ED సమన్లు, 25న విచారణ, KCRపై కేంద్రం ఉచ్చు?

టీకా డోసుల మధ్య వ్యవధి పెంపు నిర్ణయాన్నిఎన్‌టీఏజీఐ ఛైర్మన్‌ డాక్టర్ ఎన్‌కే అరోరా కూడా సమర్థించారు. డోసుల మధ్య వ్యవధి పెంపు అనేది పూర్తిగా సైంటిఫిక్ ఆధారంగా తీసుకున్న నిర్ణయమేనని, దీనిపై ఎన్‌టీఏజీఐ సభ్యుల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని, ఈ విషయంలో మీడియా కథనాలు అవాస్తవాలని ఆయన చెప్పారు. అంతేకాదు,

  COVID Third Wave ప్రభుత్వాల ముందస్తు చర్యలు ఏంటి ? MLA Jagga Reddy | Oneindia Telugu

  నిరంతరాయంగా సాగే కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో డోసుల మధ్య వ్యవధి పెంపు, తగ్గింపు అనేది ఎప్పుడైనా మారొచ్చని, భవిష్యత్తుల్లో వ్యవధి తగ్గించే అవకాశం కూడా లేకపోలేదని డాక్టర్ అరోరా వ్యాఖ్యానించారు. రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని రేపు సైంటిఫిక్ గా నిరూపణ అయితే వాటిని కూడా కమిటీ పరిశీలిస్తుందని, కనీసం 5 నుంచి 10శాతం మెరుగైన ఫలితాలు ఉన్నాయని తేలినా కమిటీ దానిపై నిర్ణయం తీసుకుంటుందని అరోరా అన్నారు.

  English summary
  The decision to increase the gap between two doses of the Covishield vaccine was "transparent" and "based on scientific data", Union Health Minister Dr Harsh Vardhan tweeted Wednesday. This is amid concern the intervals were widened - from six-eight weeks to 12-16 - without the support of the scientific group the government said had recommended the decision with "no dissenting voice". "The decision to increase the gap between administering two doses of Covishield has been taken in a transparent manner based on scientific data. India has a robust mechanism to evaluate data. It is unfortunate that such an important issue is being politicised!" the Health Minister tweeted.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X