వ్యాక్సిన్ ధరలపై షాకింగ్ ట్వీట్లు : మోడీ మిత్రుల కోసమే: రాహుల్ గాంధీ , వ్యాపారం మరెప్పుడైనా: సోనూసూద్
కరోనా నిరోధక వ్యాక్సిన్ కోవిషీల్డ్ ధరను కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాలకు నాలుగు వందల రూపాయలు, ప్రైవేట్ ఆసుపత్రులకు 600 రూపాయలుగా నిర్ణయించటంపై విపక్షాలు భగ్గుమన్నాయి. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా కరోనా వ్యాక్సిన్ వుండాలని, కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యాక్సిన్ ధరల నిర్ణయం ఉందని కాంగ్రెస్ తో పాటు, వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి . కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే రకంగా ధర ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. మరో అడుగు ముందుకు వేసి సోనూసూద్ కరోనా వ్యాక్సిన్ ను ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇచ్చేలా ప్రభుత్వం చొరవ చూపించాలన్నారు .
ఆక్సిజన్
కోసం
నిరీక్షించమని
మీరు
కరోనా
రోగులకు
చెప్తారా?
..
కేంద్రాన్ని
ప్రశ్నించిన
ఢిల్లీ
హైకోర్టు

వ్యాక్సిన్ వ్యూహం పెద్ద నోట్ల రద్దుకు తక్కువ కాదన్న రాహుల్ గాంధీ
కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భగ్గుమన్నారు. సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ వ్యూహం పెద్ద నోట్ల రద్దుకు తక్కువ కాదంటూ మండిపడ్డారు . ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్నేహితులకు ఇది గొప్ప అవకాశం అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు తమ డబ్బును, ఆరోగ్యాన్ని, జీవితాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు .

మోడీ మిత్రులకు అవకాశంగా మారిన దేశానికి వచ్చిన ఆపద అంటూ రాహుల్ ట్వీట్
కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు మాత్రమే ప్రయోజనం కలిగించేలా ఈ నిర్ణయం ఉందని , వ్యాక్సిన్ల పంపిణీలో వివక్ష కనిపిస్తోందని ఫైర్ అయ్యారు. దేశానికి ఆపద వస్తే, అది మోడీ మిత్రులకు అవసరం గా మారిందని, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని నిప్పులు చెరిగారు.
ఇక వామపక్ష పార్టీలు సైతం వ్యాక్సిన్ ల పారదర్శకత , పంపిణీ విధానంపై కేంద్రం తీరు పై నిప్పులు చెరిగారు. సిపిఎం జనరల్ సెక్రెటరీ సీతారం ఏచూరి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ లో వ్యాక్సిన్ లను పారదర్శకంగా, న్యాయబద్ధమైన విధానంలో పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్రం వ్యాక్సిన్లను ఉచితంగా రాష్ట్రాలకు అందజేయాలన్న వామపక్ష పార్టీ నేత
కేంద్రం వ్యాక్సిన్లను కొనాలని , వాటిని ఉచితంగా రాష్ట్రాలకు అందజేయాలని కోరారు. పీఎం కేర్స్ ఫండ్ లో ఉన్న లక్షల కోట్ల రూపాయలను దీని కోసం ఖర్చు చేయాలని, 70 ఏళ్ల నుంచి మన దేశంలో ఉచిత వాక్సినేషన్ కార్యక్రమమే అమలవుతుందని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే కరోనా సమయంలో ప్రజలకు సాయం అందించే రియల్ హీరో సోనుసూద్ , వ్యాక్సినేషన్ విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

వ్యాపారం మరెప్పుడైనా చేద్దాం అన్న సోనూసూద్
కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్ ల విషయంలో వ్యాపారం చేయకూడదని , మరి ఇంకెప్పుడైనా వ్యాపారం చేద్దామని పేర్కొన్న సోనూసూద్ దేశంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ను ఉచితంగా ఇవ్వాలన్నారు. అన్నిటికంటే అతి ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ ధరపై నియంత్రణ ఉండాలన్నారు. కార్పొరేట్లు, వ్యక్తిగతంగా సహాయం చేయగలవారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు దేశ ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవడానికి తమ వంతు సహాయం అందించాలని సోనూసూద్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

కోవిషీల్డ్ ధరల ప్రకటనతో పలు అనుమానాలు
కోవిషీల్డ్ ధరను నిర్ణయిస్తూ సీరం ఇన్స్టిట్యూట్ ప్రకటన చేయడంతో విమర్శలు వెల్లువగా మారడమే కాదు, పలు అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి . కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు నాలుగు వందల రూపాయలకు కోవిషీల్డ్ విక్రయిస్తామంటే , రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది . ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో వ్యాక్సిన్ కొనుగోలు రాష్ట్రాలకు తలకుమించిన భారంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సామాన్యులకు అందని ద్రాక్షలా వ్యాక్సిన్ .. వ్యాక్సిన్ పంపిణీలో వివక్ష
ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయకపోవచ్చని, సామాన్యులకు వ్యాక్సిన్ అందే అవకాశం లేదన్న భావన వ్యక్తమవుతోంది. ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్ ల కొరత గణనీయంగా ఉంది. ఇలా ధరలు నిర్ణయిస్తే కూలీ నాలీ చేసుకునే సామాన్య ప్రజలకు వ్యాక్సిన్ తీసుకోవటం కష్టంగా మారుతుంది. వ్యాక్సిన్ పంపిణీలో వివక్ష ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది . ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ డోసులు లేవని ఇప్పటికే చెప్తున్నారు. ఇలాంటి సమయంలో ధరల నిర్ణయంపై ప్రతిపక్షాల విమర్శలు, సోనూసూద్ వంటి పలువురు ప్రముఖుల విజ్ఞప్తుల నేపథ్యంలోనైనా కోవిషీల్డ్ ధరపై కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంటుందా అన్నది వేచి చూడాలి.