వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిషిల్డ్ వ్యాక్సిన్ సేఫ్.. వాలంటీర్‌కు అనారోగ్యం ఇతర సమస్యల వల్లే: సీరం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి. అయితే ఒక్కో వ్యాక్సిన్ గురించి సైడ్ ఎఫెక్ట్స్ అని కథనాలు రావడంతో ఆందోళన నెలకొంది. ఆక్స్ ఫర్డ్ అస్ట్రాజెనెకాతో భాగస్వామ్యంలో రూపుదిద్దుకుంటోన్న కోవిషిల్డ్ వ్యాక్సిన్ గురించి ఇలాంటి కథనం ఒక్కటి వచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న ఒక వాలంటీర్‌కు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని పేర్కొన్నది. అయితే అదీ తప్పు అని.. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల దుష్ర్పభావాలు రాలేదని తాజాగా వివరించింది.

కోవిషిల్డ్ వ్యాక్సిన్ సురక్షితం అని సీరం ఇనిస్టిట్యూట్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. వ్యాక్సిన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుందని వివరించింది. అయితే చెన్నైలో జరిగిన ఘటన దురదృష్టకరం అని తెలిపింది. వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రక్రియ జరుగుతోందని.. మార్గదర్శకాలు తయారవుతున్నాయని సీరం ఇనిస్టిట్యూట్ తెలిపింది.

Covishield vaccine safe, volunteer’s illness not due to dose: Serum Institute

కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్ మూడో దశ ప్రయోగంలో చెన్నైకి చెందిన వాలంటీర్ టీకా తీసుకున్నాడు. తనకు అనారోగ్యం వాటిల్లిందని సీరంపై రూ.5 కోట్లకు దావా వేసిన సంగతి తెలిసిందే. దీనిని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా విచారిస్తోంది.

Recommended Video

COVID-19 : All Party Meeting డిసెంబర్ 4న అఖిలపక్ష భేటీ.. అన్ని పార్టీలకు పిలుపు!!

యువకుడి ఆరోపణలను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఆ వలంటీర్ చేస్తోన్న ఆరోపణలు వాస్తవం కాదని నిర్ధారించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావనే నిర్ధారించుకున్న తరువాతే క్లినికల్ ట్రయల్స్ చేపట్టామని వెల్లడించింది. తప్పుడు ఆరోపణలను చేసిన ఆ వలంటీర్‌పై పరువునష్టం దావా వేయడానికి సిద్ధపడింది. కానీ ఇంతలోనే ఆ యువకుడికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని వివరించింది.

English summary
Serum Institute of India (SII), the vaccine maker has now clarified that the illness referred by a volunteer was “in no way induced by the vaccine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X