వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెజాన్ లో ఆవు పిడకలు: తిని టేస్టీగా లేవని, క్రంచీగా చెయ్యమన్న కస్టమర్ రివ్యూ వైరల్

|
Google Oneindia TeluguNews

అతి పెద్ద ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో దొరకని వస్తువంటూ ఏదీ లేదు. అమృతాంజనం దగ్గర్నుండి ఆవు పేడతో తయారు చేసిన పిడకల వరకు ప్రతి ఒక్క వస్తువు విక్రయిస్తున్న అమెజాన్ లో ఆవుపేడ పిడకలు కొనుగోలు చేసుకున్న ఒక వ్యక్తి ఆవు పిడకలకు ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

కౌ డంగ్ కేక్స్ అస్సలు టేస్ట్ లేవంటూ రివ్యూ

కౌ డంగ్ కేక్స్ అస్సలు టేస్ట్ లేవంటూ రివ్యూ

కౌ డంగ్ కేక్స్ కొనుగోలు చేసిన ఒక వ్యక్తి ఆవు పిడకలు అస్సలు టేస్ట్ లేవంటూ రివ్యూ ఇవ్వడం ఇప్పుడు వైరల్ గా మారింది. విదేశాలలో ఉన్న భారతీయుల కోసం ఆన్లైన్లో కౌ డంగ్ కేక్స్ పేరుతో అమెజాన్ విక్రయాలు జరుపుతున్న విషయం తెలిసిందే. విదేశాల్లో ఉండే భారతీయులు సాంప్రదాయ పండుగలు , పూజల నిమిత్తం నాణ్యమైన ఆవుపేడతో తయారు చేసిన పిడకలను అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. వాటిని ఎలా వినియోగించాలో ఇండియన్స్ కు తెలుసు.

శుభ్రంగా తయారు చెయ్యండి .. క్రంచీగా ఉండేలా చూడండి .. వాట్ ఏ రివ్యూ

శుభ్రంగా తయారు చెయ్యండి .. క్రంచీగా ఉండేలా చూడండి .. వాట్ ఏ రివ్యూ

అయితే అవి తినే కేక్ లు అనుకున్న ఓ విదేశీయుడు వాటిని కొనుగోలు చేసి, ఛీ టేస్ట్ అస్సలు బాలేదు అంటూ రివ్యూ ఇచ్చాడు. ఇక అతని రివ్యూ చూస్తే ఛీ ... వీటి రుచి అస్సలు బాలేదు. ఇందులో మట్టి గడ్డి కలిసినట్టుగా ఉంది. ఇవి తిన్న తర్వాత నాకు లూజ్ మోషన్స్ అయ్యాయి. ప్లీజ్ మీరు తయారు చేసేటప్పుడు కాస్త శుభ్రత పాటించండి అలాగే కొంచెం కరకరలాడే విధంగా ఉండేలా కూడా చూసుకోండి అంటూ రివ్యూ ఇచ్చాడు. ఈ రివ్యూ చూసినవాళ్లంతా షాక్ అయ్యారు.

ప్రోడక్ట్ క్రింద దేనికి వాడతారో డిస్క్రిప్షన్ .. అయినా సరే కేక్స్ అనుకున్న కస్టమర్

ప్రోడక్ట్ క్రింద దేనికి వాడతారో డిస్క్రిప్షన్ .. అయినా సరే కేక్స్ అనుకున్న కస్టమర్

అమెజాన్ లో ఈ ప్రోడక్ట్ కింద పండుగలు, పూజలు, ఇతర సాంప్రదాయ కార్యక్రమాల కోసం వాడే పిడకలు, సహజమైన, నాణ్యమైన ఆవు పేడతో చేసిన కౌ డంగ్ కేక్స్ అని రాసి ఉంది. అయినప్పటికీ అర్థం చేసుకో లేకపోయిన ఆ విదేశీయుడు వాటిని తినే కేక్స్ అనుకోవడం అందరిని నవ్వుకునేలా చేస్తోంది. ఇక అమెజాన్ కు ఆ విదేశీ కస్టమర్ ఇచ్చిన రివ్యూ చూసినవారంతా కరకరలాడేలా, క్రంచీ గా లేకుంటే ఎలా మరి అంటూ సెటైర్లు వేస్తున్నారు.

సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్న నెటిజన్లు

కొంతమంది ఇండియన్ కౌ డంగ్ కేక్స్ అంతే మరి అంటూ తెగ నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు కౌ డంగ్ కేక్స్ పై సరదా చర్చ జరుగుతుంది . ఇప్పటికైనా సదరు విదేశీయుడుకి ఇవి ఆవుపేడతో తయారు చేసిన పిడకలని , ఇవి తినేవి కాదని అర్థం అవుతాయో లేదో అని జోకులు వేస్తున్నారు.

English summary
a person purchased cow dung cakes from Amazon gave a shocking review . "Ridiculous taste," the person, who opted to remain anonymous, said in his review for the product on Amazon.This is going viral on social media..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X