వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేఈఈ అడ్వాన్స్ క్లియర్ చేయలేదు.. అయినా ఐఐటీ బాంబేలో ఎంటర్ అయింది. ఇంతకీ ఎవరో తెలుసా? (వీడియో)

|
Google Oneindia TeluguNews

ముంబై : ఐఐటీ బాంబే. అడుగుపెట్టాలంటే ఎంతో కష్టపడాలి. రాత్రి పగలన్న తేడాలేకుండా చదవితే గానీ ఆ ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లో అడుగుపెట్టడం సాధ్యం కాదు. అయితే అంత కష్టపడకుండానే జేఈఈ అడ్వాన్స్ కూడా క్లియర్ చేయకపోయినా దర్జాగా క్యాంపస్‌లో అడుగుపెట్టింది. దర్జా ఒలకబోస్తూ క్లాస్ రూంలో తిరిగింది. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? ప్రొఫెసర్‌తో పాటు స్టూడెంట్స్‌ను షాకిచ్చింది ఓ ఆవు.

శనివారం ఉదయం ఐఐటీ బాంబేలో సీరియస్‌గా క్లాస్ జరుగుతోంది. ప్రొఫెసర్ చెబుతున్న క్లాస్‌ను విద్యార్థులు బుద్దిగా వింటున్నారు. ఇంతలో క్లాస్ రూం తలుపు వద్ద అలికిడైంది. గదిలో ఉన్న వారంతా అటువైపు చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతలో తరగతి గదిలోకి వచ్చిన ఓ ఆవు దర్జాగా రూమంతా తిరింది. ఆవు క్లాస్‌రూంలోకి రావడంతో స్టూడెంట్స్ ఆ ఆవును వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌ మారింది.

Cow entered into IIT Bombay Classroom

క్లాస్ రూంలోకి ఆవు వచ్చిన వీడియో ఐఐటీ బాంబే అధికారుల దృష్టికి రావడంతో వారు విచారణకు ఆదేశించారు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందన్న విషయం స్పష్టంగా తెలియడం లేదని చెప్పారు. ఇదిలా ఉంటే భారీగా వర్షం పడుతుండటంతో దాన్నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఆవు లెక్చర్ హాల్‌లోకి వచ్చిందని స్టూడెంట్స్ అంటున్నారు. కొన్ని వారాల క్రితం బాంబే ఐఐటీ క్యాంపస్‌లో ఓ ఇంటర్న్‌ను ఎద్దులు పొడిచిన ఘటన మరవకముందే ఆవు క్లాస్ రూంలోకి రావడం విద్యార్థులతో పాటు టీచింగ్ సిబ్బందిని ఆందోళనకు గురి చేస్తోంది.

English summary
A cow interrupting a class in the prestigious institute IIT Bombay has gone viral. The video shows the cow sauntering into a classroom as amused students look on. It then strolls around the room as students try to shoot it away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X