వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరీక్ష రాసేందుకు ఆవుకి హాల్‌టికెట్: ఎలా రాస్తుందో చూడాలంటూ ఒమర్ ట్వీట్ (ట్వీట్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశ పరీక్షను ఓ ఆవు రాయబోతుంది. ఇదేంటని అనుకుంటున్నారా? జమ్మూకశ్మీర్ ‘బోర్డ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్(బీవోపీఈఈ)' జారీ చేసిన ఈ హాల్‌టికెట్ చూడండి. ఆవుకు పరీక్ష రాసే అవకాశాన్ని కల్పిస్తూ అధికారులు దానికి హాల్ టిక్కెట్‌ను మంజూరు చేశారు.

Cow issued admit card by JK authorities to write exam

కచిర్ గావ్(గోధుమ రంగు ఆవు).. డాటర్ ఆఫ్ గూరా దండ్(ఎర్ర ఎద్దు).. వయసు 18 ఏళ్లు అంటూ వివరాలున్నాయి. సంతకం, వేలిముద్రల బాక్సుల్లో తోక, గిట్ట ఫొటోలూ ఉన్నాయి. ఉదయం 9:55 గంటలు దాటితే ప్రవేశం లేదనీ స్పష్టంచేశారు. మే 10న జరిగే పరీక్ష రాసేందుకు ఈ హాల్‌టికెట్ జారీ అయింది. ''అద్భుతం! గోధుమరంగు గోమాత పరీక్షకు హాజరుకావాలని తాను కోరుకుంటున్నట్లు' జమ్ము-కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు.

కాశ్మీర్ ప్రతిపక్ష పార్టీ నేత జునైద్ అజీమ్ మట్టూ హాల్‌టికెట్ కాపీని ట్విటర్‌లో పెట్టడంతో ఆవు పరీక్ష రాస్తున్న సంగతి వెలుగులోకి వచ్చింది. విద్యామంత్రి నయీం అక్తర్ హయాంలో మంచి ప్రగతి కనిపిస్తోందని, ఆవులూ హాల్‌టికెట్లు పొందగలుగుతున్నాయంటూ మట్టూ ట్వీట్ చేశారు.

చివరకు ఈ వార్త ‘బోర్డ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్(బీవోపీఈఈ)' అధికారులకు తెలియడంతో శనివారం ఉదయం హాల్‌టికెట్‌ను వెబ్‌సైట్ నుంచి తొలగించారు. దరఖాస్తులు, హాల్‌టికెట్ల జారీ ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరగడం వల్ల పొరపాటు చోటుచేసుకుందని బోర్డు ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ఫరూక్ అహ్మద్ మీర్ వివరణ ఇచ్చారు.

మనిషి బొమ్మకు, జంతువుల బొమ్మకు తేడాను సాఫ్ట్‌వేర్ గుర్తించలేకపోవడం వల్లనే ఈ పొరపాటు జరిగిందని చెప్పారు. ఆవు ఫొటోను అప్‌లోడ్ చేసిన, వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

English summary
A cow, brown indeed, has got an admit card issued by authorities on her name to write a professional entrance examination next week here and former Jammu and Kashmir Chief Minister Omar Abdullah is keen on seeing her appear in the paper.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X