వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్లూట్ ఆవు ముందు ఊదు.. పాలు ఎక్కువగా ఇస్తుంది..! బీజేపీ ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

సంగీతానికి చింతకాయాలు రాలవు అనే సామేత ఉంది. కాని ఈ సామేతను నిజం చేస్తూ ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశాడు. చింతకాయాలు ఏం ఖర్మ ఏకంగా పాలు ఉబికి వస్తాయని అంటున్నాడు బీజేపీ ఎమెల్యే. సంగీతానికి చింతకాయలు రాలవోమో గాని పాలు మాత్రం కారుతాయని చెబుతున్నాడు..ఫ్లూట్‌తో అధిక దిగుబడి వస్తుందని, ఇది ప్రయోగత్మకంగా జరిగిందని చెబుతున్నాడు.

అధిక పాల ఉత్పత్తికి ఫ్లూట్ వాడండి

అధిక పాల ఉత్పత్తికి ఫ్లూట్ వాడండి

పాల ఉత్పత్తి కోసం వ్యవసాయదారులు,రైతులు అనేక కష్టాలు పడతారు. ఆవుకు పచ్చిగడ్డి వేసే దగ్గరి నుండి పూర్తి స్థాయి వసతులు కల్పించే వరకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. అయినా ఉత్పత్తి మాత్రం రైతులు అశించినట్టుగా ఉండని పరిస్థితి. దీంతో పాల ఉత్పత్తి కోసం అనేక తంటాలు పడుతూనే ఉంటారు. కాని రైతు కష్టంతో పాటు పాల ఉత్పత్తి శాతాన్ని పెంచే చిట్కాను అస్సాంకు చెందిన దిలిప్ కుమార్ పాల్ అనే బీజేపీ ఎమ్మెల్యే చెప్పాడు. పాల ఉత్పత్తి పెరగాలంటే ,ఆవుల ముందు ఫ్లూట్ ఊదితే సరిపోతుందంటున్నాడు. సంగీతంలో పాటు డాన్స్ ప్రత్యేకతలను వివరించిన వాటి ప్రభావం పాలిచే గేదేలపై ఉంటుందని చెప్పాడు. అస్సాంలోని ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గోన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.

అనేక పరిశోధనలు

అనేక పరిశోధనలు

ఈ నేపథ్యంలోనే లీసెస్టర్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు మనస్తత్వశాస్త్రవేత్తలు సైతం 2001 లోనే ఈ విషయాన్ని నిరూపించారని చెప్పారు. ఫాస్ట్ సంగీతం కంటే నెమ్మదిగా మృదువుగా ఉండే సంగీతాన్ని విన్న ఆవులు అధికంగా మూడుశాతం పాలను ఇస్తాయని నిరూపించారని చెప్పారు. దీనికి తోడు గుజరాత్‌కు చెందిన ఓ ఎన్జీవో ఆర్గనైజేషన్ కూడ చేసిన రీసెర్చ్ కూడ సంగీతానికి పాల ఉత్పత్తికి సంబంధం ఉందని చెప్పారు. సంగీతం ద్వార పాల ఉత్పత్తి పెరిగిందని కూడ ఆయన చెప్పారు.

స్వదేశీ ఆవుల పాలు మేలు

స్వదేశీ ఆవుల పాలు మేలు

ఈ నేపథ్యంలోనే భారతీయ జాతీకి చెందిన ఆవుల పాలు చాల శ్రేష్టమైనవని చెప్పారు. వీదేశాలకు చెందిన పాలు చాల తెల్లగా ఉంటాయని, కాని భారతీయ ఆవులకు చెందిన పాలు మాత్రం పసుపు రంగులో ఉంటాయని తెలిపారు. ఈనేపథ్యంలో విదేశీ ఆవుల కంటే స్వదేశీ ఆవులే మేలని చెప్పారు. వీటీని వచ్చే ఉత్పత్తులు కూడ ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయని చెప్పారు. దీంతోపాటు వాటి కోసం రాసిన పాటలు కొన్ని సంధర్భాల్లో సక్సెస్ కాగా మరికొంతమంది పాల ఉత్పత్తి కోసం రాసిన పాటలు విఫలం అయ్యాయని చెప్పారు. అయితే తల్లిలా భావించే భారతీయ గోవులను బంగ్లాదేశ్‌కు ప్రతి సంవత్సరం వేలాదిగా స్లగ్లింగ్ చేస్తున్నారని ,వీదేశాలకు ఆవుల స్లగ్లింగ్ ఆగిపోవాలని ఆయన కోరారు.

స్వదేశీ ఆవుల పాలు మేలు

స్వదేశీ ఆవుల పాలు మేలు

ఈనేపథ్యంలోనే భారతీయ జాతీకి చెందిన ఆవుల పాలు చాల శ్రేష్టమైనవని చెప్పారు. వీదేశాలకు చెందిన పాలు చాల తెల్లగా ఉంటాయని, కాని భారతీయ ఆవులకు చెందిన పాలు మాత్రం పసుపు రంగులో ఉంటాయని తెలిపారు. ఈనేపథ్యంలో విదేశీ ఆవుల కంటే స్వదేశీ ఆవులే మేలని చెప్పారు. వీటీని వచ్చే ఉత్పత్తులు కూడ ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయని చెప్పారు. దీంతోపాటు వాటి కోసం రాసిన పాటలు కొన్ని సంధర్భాల్లో సక్సెస్ కాగా మరికొంతమంది పాల ఉత్పత్తి కోసం రాసిన పాటలు విఫలం అయ్యాయని చెప్పారు. అయితే తల్లిలా భావించే భారతీయ గోవులను బంగ్లాదేశ్‌కు ప్రతి సంవత్సరం వేలాదిగా స్లగ్లింగ్ చేస్తున్నారని ,వీదేశాలకు ఆవుల స్లగ్లింగ్ ఆగిపోవాలని ఆయన కోరారు.

English summary
A BJP legislator from Assam has claimed cows produce more milk when they listen to tunes on the flute similar to the ones played by Lord Krishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X