వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేడీ లీడర్ ను గిల్లిన ఎమ్మెల్యే, ఇల్లు, ఆఫీస్ అన్నాడు, అధికారం: విసిగిపోయింది: హైకమాండ్ దెబ్బ!

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: సొంత పార్టీ మహిళ నాయకురాలితో రాసలీలలు జరపాలని తీవ్రస్థాయిలో ప్రయత్నించి ఆమెను గిల్లాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఎమ్మెల్యే సీపీఐ (ఎం)పై వేటుపడింది. మహిళా నాయకురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేసిన పార్టీ హైకమాండ్ ఎమ్మెల్యే పీకే. శశిని ఆరు నెలల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది.

లేడీ లీడర్ పై కన్ను

లేడీ లీడర్ పై కన్ను

కేరళలో అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే పీకే. శశి కొంత కాలంగా సొంత పార్టీ మహిళా నేత మీద కన్ను వేశాడని ఆరోపణలు ఉన్నాయి. పార్టీ కార్యకలాపాలతో పాటు ఇంటి దగ్గరకు వచ్చిన మహిళా నేతతో ఎమ్మెల్యే పీకీ. శశి అసభ్యంగా ప్రవర్తించాడని సమాచారం.

జిల్లా నాయకులు

జిల్లా నాయకులు

చాలం కాలం ఎమ్మెల్యే పీకే. శశి వేధింపులు భరించిన మహిళా నాయకురాలు పార్టీ జిల్లా నాయకులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎమ్మెల్యే శశి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. విసిగిపోయిన మహిళా నాయకురాలు చివరికి పార్టీ హైకమాండ్ తో పాటు సీతారాం ఏచూరికి లేఖ రాశారు.

లేడీ లీడర్ వార్నింగ్

లేడీ లీడర్ వార్నింగ్

ఎమ్మెల్యే పీకే. శశి ఆగడాలపై ఆమె హైకమాండ్ కు పూర్తి సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే శశి మీద చర్యలు తీసుకోకుంటే తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మహిళా నాయకురాలు హెచ్చరించారు. మహిళా నాయకురాలు లేఖ పరిశీలించిన పార్టీ హై కమాండ్ ఎమ్మెల్యే శశి మీద విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

లేడీకి గిలిగింతలు

లేడీకి గిలిగింతలు

విచారణలో ఎమ్మెల్యే శశి మహిళా నాయకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని వెలుగు చూసింది. ఎమ్మెల్యే పీకే. శశిని ఆరు నెలల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశామని, విచారణ కొనసాగుతోందని కేరళ న్యాయశాఖ మంత్రి ఏకే. బాలన్, లోక్ సభ సభ్యురాలు పీకే. శ్రీమతి అన్నారు.

ఎమ్మెల్యే రసికుడు

ఎమ్మెల్యే రసికుడు

ఎమ్మెల్యే శశిని అరెస్టు విచారణ చెయ్యాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పీకే. శశి మీద అనేక లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఉన్నామని, తమను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని శశి ధీమాగా ఉన్నారని, అతన్ని చట్టపరంగా అరెస్టు చేసి విచారణ చేయించాలనే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

English summary
The Kerala unit of the CPI-M on Monday suspended P.K. Sasi for six months from its primary membership for misbehaving with a women member.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X