బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేరుగొప్ప ఊరుదిబ్బ: అక్కడ మెట్రో పిల్లర్లలో బీటలు.. ప్రయాణికుల్లో ఆందోళన

|
Google Oneindia TeluguNews

Recommended Video

పేరుగొప్ప ఊరుదిబ్బ.. బెంగళూరు మెట్రో పిల్లర్లలో బీటలు..!! || Oneindia Telugu

పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా ఉంది బెంగళూరు మెట్రో పరిస్థితి. బెంగళూరు మెట్రో అయితే చాలా ఘనంగా ప్రారంభమైంది కాదని ప్రారంభమైన కొన్నేళ్లకే ఆ పిల్లర్లకు బీటలు పడ్డాయి. దీంతో మెట్రోలో ప్రయాణించాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. కొన్ని నెలల క్రితం ఎంజీ రోడ్డు ట్రినిటీ సర్కిల్ వద్ద పిల్లర్‌కు బీటలు ఏర్పడటంతో మరమత్తులు చేశారు. అంతలోనే తాజాగా సౌత్ ఎండ్ సర్కిల్ పిల్లర్‌లో చీలికలు కనిపించాయి. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని బీఎంఆర్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సేత్ తెలిపారు. బసవగుడి దగ్గర ఓ పిల్లర్‌కు చీలిక ఏర్పడిందన్న వార్త దావనంలా పాకడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.

ఇక మెట్రో పిల్లర్ చీలిందన్న విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే దానికి మరమత్తులు చేపట్టారు. అయితే చీలిక లేదని చెప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పిల్లర్‌కు చెందిన బేరింగ్ ఒకటి కిందపడిందని తెలిపారు. దానిని సరిజేసినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా బేరింగ్‌లు కిందకు పడిపోతుంటాయని వెంటనే సరిజేస్తుంటామని అధికారులు తెలిపారు.

Crack surfaced in Bengaluru Metro pillar, panic created in passengers

అంతకుముందు ట్రినిటీ సర్కిల్ మెట్రో పిల్లర్ చీలిక ఏర్పడటంతో అధికారులు మరమత్తుల నిమిత్తం ఆ రూట్లో మెట్రో సేవలను నిలిపివేశారు. మరమత్తులు పూర్తి చేసిన తర్వాత తిరిగి సేవలను ప్రారంభించారు.

English summary
Bengaluru metro once again made headlines with the cracks in the pillar basavana gudi, this led to a panic in passengers. Officials said that they had fixed the crack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X