• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Republic day 2022:హెల్త్ కేర్ వర్కర్లకు అభినందనలు, సైనికులకు సెల్యూట్: రిపబ్లిక్ డే స్పీచ్‌లో కోవింద్

|
Google Oneindia TeluguNews

దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ఆయన 73వ రిపబ్లిక్ డే పురష్కరించుకొని ప్రసంగించారు. కరోనా సమయంలో కూడా ప్రభుత్వం భేష్‌గా పనిచేసిందని చెప్పారు. ఇతర దేశాలకు కరోనా టీకాలను సరఫరా చేసి ప్రశంసలను అందుకుందని గుర్తుచేశారు. కరోనా వైరస్‌ను పూర్తిగా జయించేవరక జాగ్రత్తగా ఉండాలని.. మాస్క్, ఫిజికల్ డిస్టన్స్ తప్పనిసరి అని చెప్పారు. కరోనా వైరస్ సమయంలో దేశం అనేక సవాళ్లను ఎదుర్కొందని తెలియజేసింది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజ్యాంగం గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.

విధులు, హక్కులు అనేవి నాణెనికి బొమ్మ, బొరుసు లాంటివి అని కోవింద్ అభిప్రాయపడ్డారు. దేశ భద్రత కోసం ప్రాణాలను ఆర్పించిన అమరులను కోవింద్ స్మరించుకున్నారు. నేతాజీ 125వ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నామని గుర్తుచేశారు. ఆపద కాలంలో ఒకరికొకరు సాయం చేసుకోవడం ముఖ్యం అని అభిప్రాయపడ్డారు. సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు, సిబ్బంది మరణం బాధించిందని వివరించారు.

Credit to Our Citizens for Turning Covid Vaccine Drive Into Mass Movement: Kovind

దేశం కోసం సరిహద్దులో శ్రమిస్తోన్న సైనికులకు కోవింద్ సెల్యూట్ చేశారు. కరోనా వైరస్‌ను టీకా వల్లే తరిమికొట్టొచ్చు అని.. ఇందుకోసం శ్రమించిన హెల్త్ వర్కర్ల సేవలను ప్రశంసించారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ స్టాప్.. ఆహోరాత్రులు శ్రమించారని.. శ్రమిస్తున్నారని తెలిపారు.

స్వదేశి పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌సీ విక్రాంత్ త్వరలో జాతికి అంకితం చేయబోతున్నామని కోవింద్ తెలిపారు. రక్షణ రంగంలో కొత్త ఆవిష్కరణలు జరగబోతున్నాయని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ది నిరంతరం సాగే ప్రక్రియ అని కోవింద్ అన్నారు. దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతుత్వం..అందరికీ సమాన హక్కులను రాజ్యాంగం కల్పించిందని కోవింద్ గుర్తుచేశారు.

ఇటు రిపబ్లిక్ డే కోసం 27 వేల మంది పోలీసులను బందోబస్త్ కోసం ఉపయోగిస్తామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా ఇంతకుముందే చెప్పారు. 71 మంది డీసీపీలు, 213 మంది ఏసీపీ, 753 మంది ఇన్ స్పెక్టర్లు విధుల్లో పాల్గొంటారని చెప్పారు. 65 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు కూడా ఉంటాయని చెప్పారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించి చర్యలు తీసుకున్నామని వివరించారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగుకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

English summary
President Ram Nath Kovind on Tuesday credited crores of countrymen for turning Covid-19 vaccination campaign into a mass movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X