వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందర్నీ కలిపే దహనం చేయండి: ‘మాస్ మర్డర్స్, సూసైడ్’ వ్యాపారవేత్త చివరి కోరికలివే..

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో జరిగిన సామూహిక హత్యలు, ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కాగా, ఈ ఘటనలో పోలీసుల దర్యాప్తులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఓ వ్యాపారవేత్త తన భార్యతోపాటు ముగ్గురు పిల్లలను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

8వ అంతస్తు నుంచి దూకి..

8వ అంతస్తు నుంచి దూకి..

వ్యాపారవేత్త వాసుదేవ్(45) తన కుటుంబంతోపాటు ఇందిరాపురంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. కాగా, మంగళవారం వాసుదేవ్ తన భార్య పర్వీన్, మేనేజర్ సంజనతోపాటు ఆ అపార్ట్‌మెంట్ 8వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మాస్ సూసైడ్: ఇద్దరు పిల్లలను పొడిచి చంపి, కుటుంబం మొత్తం ఆత్మహత్య: పెంపుడు కుందేలును సైతం.. !మాస్ సూసైడ్: ఇద్దరు పిల్లలను పొడిచి చంపి, కుటుంబం మొత్తం ఆత్మహత్య: పెంపుడు కుందేలును సైతం.. !

అంత్యక్రియలకు రూ. 10వేలు..

అంత్యక్రియలకు రూ. 10వేలు..

కాగా, అంతేగాక, వారి అంత్యక్రియల కోసం రూ. 10వేలను కూడా వారి నివాసంలో ఉంచడం గమనార్హం. తన బావ మరిది రాకేష్ వర్మ ఇచ్చిన బౌన్స్ అయిన చెక్కులను కూడా వాసుదేవ్ తన నివాసంలో గోడలకు అతికించాడు. తమను ఆర్థిక ఇబ్బందులోకి నెట్టి, తమ ఆత్మహత్యకు కారణమయ్యాడని రాకేష్ వర్మ పేరును పేర్కొన్నారు వాసుదేవ్.

ఆర్థిక ఇబ్బందులతో.. ఆ 10వేలు వారికే..

ఆర్థిక ఇబ్బందులతో.. ఆ 10వేలు వారికే..

చెక్కులు బౌన్స్ కావడం, వర్మ చెప్పిన ప్రాపర్టీలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి రాకపోవడంతో వాసుదేవ్ కుటుంబం తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయిందని ఘజియాబాద్ సీనియర్ ఎస్పీ సుధీర్ కుమార్ సింగ్ తెలిపారు. కాగా, తామందరికి ఒకేచోట ఒకేసారి దహన సంస్కారాలు చేయాలని వాసుదేవ్ తన చివరి కోరికను ఇంటిలోని గోడల మీద రాశాడని, తమ అంత్యక్రియలు నిర్వహించిన బంధువులకు రూ. 10వేలను అందజేయాలని కూడా రాశాడని సీనియర్ ఎస్పీ తెలిపారు.

కుమారుడు, కుమార్తె, కుందేలును కూడా చంపేశాడు..

కుమారుడు, కుమార్తె, కుందేలును కూడా చంపేశాడు..

కుమారుడు హృతిక్(14), కూతురు హృతిక(18)లను హత్య చేసిన వాసుదేవ్.. తమ పెంపుడు కుందేలును కూడా చంపేశాడు. తామంతా చనిపోయిన తర్వాత దానికి ఆహారం ఎవరు పెడతారనే ఉద్దేశంతో కుందేలును కూడా చంపేసినట్లు తెలుస్తోంది.

దారుణానికి ముందు వీడియో కాల్.. ఎంత చెప్పినా..

దారుణానికి ముందు వీడియో కాల్.. ఎంత చెప్పినా..


కాగా, ఈ దారుణానికి పాల్పడే ముందు వాసుదేవ్ తన అంకుల్ రమేష్ అరోరాకు వాట్సప్ వీడియో కాల్ చేశారు. మంగళవారం ఉదయం 3.30 వరకు వాసుదేవ్ ఆన్‌లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే కుటుంబసభ్యులను చంపి, అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘ఢిల్లీలోని జిల్మిల్‌లో ఉండే అరోరా.. విషయం గమనించి ఆర్థికంగా తాను సహాయం చేస్తానని.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. నాలుగున్నర నిమిషాల వీడియోలో వాసుదేవ్ ఎంత ఒత్తిడిలో ఉన్నారో అరోరా తెలుసుకున్నారు. ఆయన ఎంత చెప్పిన వినకుండా వాసుదేవ్ తన జీవితాన్ని ముగించారు' అని పోలీసు అధికారి తెలిపారు.

రాకేష్ వర్మ అరెస్ట్..

రాకేష్ వర్మ అరెస్ట్..

కాగా వాసుదేవ్‌కు మానసిక సమస్యలు కూడా ఉన్నాయని అరోరా తెలిపారని చెప్పారు. జీతం ఇచ్చే పరిస్థితిలో లేనని.. నెలరోజుల క్రితమే తన ఇంట్లోని పనిమనిషిని కూడా మాన్పించాడని చెప్పారు. సమాజంలోని కాపాలదారులకు స్వెటర్లు, దుస్తులు కూడా వాసుదేవ్ ఇచ్చేశాడని తెలిపారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బుధవారం వాసుదేవ్ బావమరిది రాకేష్ వర్మను అరెస్ట్ చేశారు.

English summary
When the police got into the flat of businessman Gulshan Vasudeva, they found bodies of his son and daughter and a suicide note scrawled on the wall in which he wished that all the five members of his family be cremated together, an official said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X