• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఖననమా..? దహనమా..? కరోనా మృతులకు ఏది కరెక్ట్.. డబ్ల్యూహెచ్ఓ ఏమంటోంది..

|

మరణం తర్వాత ఆయా వ్యక్తుల మత ఆచారాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించడం సహజం. ప్రత్యేకించి భారత్‌లో కొన్ని సామాజికవర్గాలు ఖననం పద్దతిని అనుసరిస్తే.. కొన్ని సామాజికవర్గాలు దహన సంస్కారాలు నిర్వహిస్తాయి. ఈ రెండింటిలో ఏది శాస్త్రీయ విధానం అనే చర్చ చాలా కాలంగా జరుగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో.. కరోనా మృతుల అంత్యక్రియలు ఏ పద్దతిలో నిర్వహించాలన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పూడ్చివేత కంటే దహన సంస్కారాలు నిర్వహించడమే సరైందని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) వాదిస్తోంది. అయితే డబ్ల్యూహెచ్ఓ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది.

వీహెచ్‌పీ ఏం చెబుతోంది..

వీహెచ్‌పీ ఏం చెబుతోంది..

కుల,మతాలకు అతీతంగా కరోనా మృతుల అంత్యక్రియలకు దహన సంస్కారాలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్(VHP) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ తరహా పద్దతినే పాటించాలని కోరింది. కరోనా మృతులను ఖననం చేయడం ద్వారా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తెరిగి భారత్‌లో ఉన్న ప్రజలంతా అంత్యక్రియల్లో దహన సంస్కార పద్దతినే అవలంభించాలని పేర్కొంది. అందుకు విరుద్దంగా వ్యవహరిస్తే.. అది తమకే కాదు,దేశం మొత్తానికి హాని చేస్తుందని తెలిపింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో మత ప్రార్థనల్లో పాల్గొన్నవారు స్వస్థలాలకు చేరిన తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వీహెచ్‌పీ ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. తెలంగాణలో మృతి చెందిన ఆరుగురు మర్కజ్‌కి వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారు. అలాగే మహారాష్ట్రలోనూ మర్కజ్‌ వెళ్లి వచ్చిన ఇద్దరు మృత్యువాతపడ్డారు.

డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పింది..

డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పింది..

డబ్ల్యూహెచ్ఓ(ప్రపంచ ఆరోగ్య సంస్థ) మాత్రం వీహెచ్‌పీ వాదనకు భిన్నంగా స్పందించింది. ఖననమైనా.. దహనమైనా.. సరైన జాగ్రత్త చర్యలు పాటించాలని పేర్కొంది. దహనం కంటే ఖననం చేయడం ద్వారా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందన్న వాదనలో నిజం లేదని తెలిపింది. దహనం అనేది వాళ్ల ఆచారాలకు సంబంధించిన వ్యవహారమని చెప్పింది. కరోనా మృతుల అంత్యక్రియలకు డబ్ల్యూహెచ్ఓ,ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన గైడ్ లైన్స్‌ను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది.

ముంబై కమిషనర్ ఆదేశాలతో చర్చనీయాంశం

ముంబై కమిషనర్ ఆదేశాలతో చర్చనీయాంశం

ముంబై మున్సిపల్ కమిషనర్ ప్రవీన్ పర్దేశీ కరోనా మృతులకు దహన సంస్కారాలే నిర్వహించాలంటూ సర్క్యులర్ జారీ చేయడంతో ఈ చర్చ తెర మీదకు వచ్చింది. కుల,మతాలకు అతీతంగా కరోనా మృతులను దహనం చేయాలంటూ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అయితే మహారాష్ట్ర మైనారిటీ డెవలప్‌మెంట్ మంత్రి నవాబ్ మాలిక్ ఈ సర్క్యులర్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా దీన్ని తప్పు పట్టారు. ఇది ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు విరుద్దం అని చెప్పారు. దీంతో మున్సిపల్ కమిషనర్ వెనక్కి తగ్గక తప్పలేదు. తీవ్ర వ్యతిరేకత తర్వాత సర్క్యులర్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు.

ఢిల్లీ మర్కజ్‌పై వీహెచ్‌పీ ఫైర్..

ఢిల్లీ మర్కజ్‌పై వీహెచ్‌పీ ఫైర్..


మరోవైపు ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో తబ్లిఘీ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్నవారిపై వీహెచ్‌పీ విరుచుకుపడింది. ఓవైపు దేశమంతా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కరోనా నియంత్రణ కోసం 21 రోజుల లాక్ డౌన్ పాటిస్తుంటే.. తబ్లిఘీ జమాత్ నిర్వాహకులు దాన్ని భగ్నం చేశారని విమర్శించింది. చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి ఢిల్లీ పోలీసులు,పాలకులపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది.మసీదులు,మదర్సాలలో ఉన్న వీరందరినీ బయటకు తీసుకొచ్చే బదులు.. తమకు తాము అక్కడే క్వారెంటైన్ చేసుకోవాలని సూచించింది. తద్వారా వైరస్ అక్కడికే కట్టడి చేయబడుతుందని పేర్కొంది. జమాత్‌లో పాల్గొన్న విదేశీ ముల్లా,మౌలవాసిల టూరిస్ట్ వీసాలను రద్దు చేసి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇటీవల షాహీన్‌బాగ్‌లో సీఏఏ వ్యతిరేక నిరసనలకు మద్దతు పలికిన మేదావులు,లౌకికవాదులు.. ఈ ఘటనపై మౌనదాల్చడం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేసింది.

English summary
The burial of the mortal remains of the patients dying of COVID-19 is not more dangerous than cremation; rather both would be equally hazard-free if carried out in accordance with safety procedures, the World Health Organization (WHO) has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X