వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెటర్ సిద్దు సైలంట్ మోడ్‌... పార్టీ మారడంపై పుకార్లు : నవజోత్ కౌర్ సిద్దు

|
Google Oneindia TeluguNews

మాజీ క్రికెటర్, పంజాబ్ మాజీ మంత్రి అయిన నవజోత్ సింగ్ సిద్దు ప్రస్తుతం సైలంట్ మోడ్‌లో ఉన్నాడని ఆయన భార్య నవజోత్ కౌర్ సిద్దు తెలిపింది. దీంతో పాటు సిద్దు బీజేపీలోకి వెళుతున్నాడన్న వార్తల్లో కూడ నిజం లేదని స్పష్టం చేసింది. సిద్దు పార్టీ మారుతున్నారనేవి పుకార్లని కొట్టి పారేసింది. కాగా సిద్దును క్యాబినెట్ మంత్రిగా తొలగించినప్పటి నుండి ఎలాంటీ పార్టీ కార్యకలాపాల్లో పాల్గోనండం లేదు. దీంతో గత కొద్దిరోజులుగా సైలంట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీలోకి వెళతారని ప్రచారం కూడ జరుగుతోంది. కాగా ఆమే కూడ తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత విభేదాలు

పార్లమెంట్ ఎన్నికల తర్వాత విభేదాలు

పార్లమెంట్ ఎన్నికల తర్వాత పంజాబ్ రాజకీయాల్లో మాజీ క్రికెటర్ సిద్దు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పంజాబ్ ముఖ్యమంత్రి కాప్టెన్ అమరిందర్ సింగ్ మరియు సిద్దుల మధ్య రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యంగా సిద్దూ పాకిస్తాన్‌లో పర్యటించినప్పటి నుండి ఇరువురి మధ్య మరింత వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ క్యాబినెట్ ప్రక్షాళన చేయకుండా వివాదానికి మరింత బీజం వేసింది.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేసిన విస్తరణలో ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అయితే సిద్దు మాత్రం ముఖ్యమంత్రి కేటాయించిన విద్యుత్ శాఖను చేపట్టకుండా కనీసం సెక్రటేరియట్‌కు కూడ వెళ్లని పరిస్థితి ఉంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి సిద్దూ వ్వవహారశైలి కారణమంటూ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలతో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది.

పార్టీ మారడంలో నిజం లేదు

పార్టీ మారడంలో నిజం లేదు

ఇక రాజకీయాల్లో చురుకుగా ఉండే సిద్దు అప్పటి నుండి సైలంట్ అయ్యాడు. దీంతో ఆయన తిరిగి బీజేపీలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. అందుకే సిద్దు వ్యుహాత్మకంగా వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఎమ్మెల్యే భాద్యతలు మాత్రమే చూసుకుంటున్నాడని ఆయన భార్య తెలిపింది. సిద్దు ఒక మంచి కష్టపడే తత్వం ఉన్నవాడని, అయినా ముఖ్యమంత్రి క్యాబినెట్ నుండి తోలగించాడని ఆమే మీడీయాతో మాట్లాడుతూ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.

క్రికెటర్ నుండి 2004లో రాజకీయావేత్తగా మారిన సిద్దూ

క్రికెటర్ నుండి 2004లో రాజకీయావేత్తగా మారిన సిద్దూ

నవజ్యోత్ సింగ్ సిద్ధు 2004 లో భారతీయ జనతా పార్టీతో తన రాజకీయా వృత్తిని ప్రారంభించాడు, బీజేపీలో చేరిన అనంతరం అమృత్‌సర్ లోక్‌సభ స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. కాగా 2014 వరకు ఎంపీగా కొనసాగారు. సిద్దూను మరోసారి 2016 లో బిజెపి రాజ్యసభకు నామినేట్ చేసినప్పటికీ, దానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అనంతరం అమరిందర్ సింగ్ క్యాబినెట్‌లో మంత్రిపదవి చేపట్టాడు. కొద్ది రోజులకే ఇద్దరి మధ్య వివాదం రావడంతో కొద్ది రోజుల నుండి సైలంట్ అయ్యాడు. తన సీటుకు రాజీనామా చేసి భార్యను కాంగ్రెస్‌కు అనుసరించింది.

English summary
Navjot Sidhu on silent mode,sidhu wife Navjot Kaur Sidhu says and reports of his return to BJP ‘only a rumour’ she cleared.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X