వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవంబర్‌లో కరోనా ఉధృతి: తప్పుదోవ పట్టించేందుకేనంటూ ఐసీఎంఆర్ క్లారిటీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో వచ్చే నవంబర్‌లో కరోనా మహమ్మారి విజృంభణ భారీగా ఉంటుందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) స్టడీ తేల్చిందంటూ వచ్చిన కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆ సంస్థ ప్రకటించింది. తాము అలాంటి స్టడీ ఏమీ ప్రకటించలేదని స్పష్టం చేసింది.

నవంబర్ మధ్య నాటికి కరోనా మహమ్మారి దేశంలో బారీగా వ్యాపిస్తోందని ఐసీఎంఆర్ స్టడీ వెల్లడించిందంటూ ఇటీవల పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ స్పష్టతనిచ్చింది. తాము అలాంటి ప్రకటన చేయలేదని పేర్కొంది.

cricketICMR rejects reports attributing to it a study regarding peak stage of COrona in India

అవన్నీ తప్పుడు వార్తలేనని కొట్టిపారేసింది ఐసీఎంఆర్. ఐసీఎంఆర్ పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. నవంబర్ లో కరోనా ఉధృతి అంటూ తాము ఎలాంటి ప్రకటనా చేయలేదని మరోసారి స్పష్టం చేసింది.

కాగా, దేశంలో ఇప్పటి వరకు 3,33,475 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,53,684 యాక్టివ్ కేసులున్నాయి. 1,70,467 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 9530 మంది మరణించారు. ఇక మహారాష్ట్రలో అత్యధికంగా 1,07,958 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 53,017 యాక్టివ్ కేసులున్నాయి. 50,978 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 3950 మంది ఇప్పటి వరకు కరోనాతో మరణించారు.

English summary
The Indian Council of Medical Research, ICMR has rejected media reports attributing to its study regarding peak stage of COVID-19 in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X