వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్ సంక్షోభం: 22 లోగా బలపరీక్ష - సీఎం గెహ్లాట్ అనూహ్యం.. అవసరంలేదన్న బీజేపీ..ఆసక్తికర ట్విస్ట్

|
Google Oneindia TeluguNews

రాజస్థాన్ రాజకీయ సంక్షోభం అనూహ్య మలుపులు తిరుగుతున్నది. రెబల్ నేత సచిన్ పైలట్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత నోటీసులుజారీ చేసిన తర్వాత.. అశోక్ గెహ్లాట్ సర్కారు మైనార్టీలో పడిపోయిందని, వెంటనే బలనిరూపణ చేసుకోవాలని విపక్షనేతలు డిమాండ్ చేశారు. తీరా బలపరీక్షకు సీఎం సిద్ధంకాగా.. తాము ఆ డిమాండ్ చేయనేలేదని కాషాయ నేతలు యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీ కీలక నేతలు బేరసారాలు నెరపిన వీడియోలపై దుమారం కొనసాగుతున్నది.

Recommended Video

Audio Tapes కలకలం... Congress దూకుడు, రెబల్‌ ఎమ్మెల్యేల కు Show Cause Notices, BJP వ్యూహం ?

జగన్ భార్య భారతికి బ్లాక్‌మనీ లింకులు.. బాలినేని ఘటనపై లోకేశ్ బాంబు.. సాయిరెడ్డి లోకజ్ఞాన ప్రబోధజగన్ భార్య భారతికి బ్లాక్‌మనీ లింకులు.. బాలినేని ఘటనపై లోకేశ్ బాంబు.. సాయిరెడ్డి లోకజ్ఞాన ప్రబోధ

వారం రోజులుగా రాజస్థాన్‌లో కొనసాగుతోన్న సంక్షోభానికి తెరదించే దిశగా సీఎం అశోక్ గెహ్లాట్ అడుగులు వేస్తున్నారు. ఈ నెల 22(బుధవారం)లోగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సీఎం డిసైడైనట్లు పార్టీ వర్గాలు ఆదివారం తెలిపాయి. అందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారని సమాచారం. శనివారం గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను సీఎం కలుసుకుని, ఇద్దరు భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తూ రాసిన లేఖలను సమర్పించారు. అదే సమయంలో బలపరీక్షపైనా గవర్నర్ తో చర్చించినట్లు సమాచారం.

cricketrajasthan crisis: cm gehlot likely to call assembly session, cong-bjp war over audio tapes

గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 స్థానాలున్న రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ 107 సీట్లు దక్కించుకుని అధికారం చేపట్టింది. టీబీపీ(2), సీపీఎం(2), ఇండిపెండెంట్లు(2), ఆర్ఎల్డీ(1) కాంగ్రెస్ కు మద్దతిచ్చాయి. సచిన్ పైలట్ వెంట 19 మంది ఎమ్మెల్యేలు వెళ్లడంతో నంబర్లు అటుఇటయ్యాయి. 19 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులపై ఇంకా స్పందించలేదు. తాడో పేడో తేల్చుకునేదుకు కాంగ్రెస్.. ఈనెల 22లోగా బలపరీక్షకు రెడీ అవుతుండగా, బల నిరూపణ చేసుకోవాలని తామెన్నడూ డిమాండ్ చేయలేదని బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు జీసీ కటారియా అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో, ఆడియో టేపుల వ్యవహారంతో బీజేపీకి సంబంధం లేదని ఆయన చెప్పారు. బలపరీక్షపై కటారియా వ్యాఖ్యలను మరో ట్విస్ట్ గా విశ్లేషకులు భావిస్తున్నారు.

దేశంలో తొలిసారి.. జగన్ ప్రతిష్ట రెట్టింపు.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవిష్కణకు కేంద్రం ఫండింగ్.దేశంలో తొలిసారి.. జగన్ ప్రతిష్ట రెట్టింపు.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవిష్కణకు కేంద్రం ఫండింగ్.

అశోక్ గెహ్లాట్ సర్కారును కూల్చడానికి బీజేపీ కుట్రలకు పాల్పడిందన్న కాంగ్రెస్ నేతలు.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మరో బీజేపీ నేత సంజయ్ జైన్‌ ఆడియో టేపుల్ని బయటపెట్టింది. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదై, జైన్‌ను అదుపులో తీసుకున్నారు. కేంద్ర మంత్రి షెకావత్ ను కూడా వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు. ఆడియోటేపుల్లో అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది.

English summary
A day after Rajasthan chief minister Ashok Gehlot met governor Kalraj Mishra, Congress sources on Sunday said a brief session of the state assembly may be called this week. floor test could be on 22nd july.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X