వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో .. కిచెన్‌లో మొసలి : పరుగుతీసిన తల్లీ, బిడ్డ

|
Google Oneindia TeluguNews

వడోదర : వంటగదిలో అనుకొని అతిథి ప్రత్యక్షమైంది. దానిని చూసి చెంగున పరుగెత్తింది ఆమె. వెంటనే విషయం చెబితే .. అవునా అంది .. తన కళ్లతో ఆ మొసలిని చూస్తూ తప్ప నమ్మలేదు తల్లి. తమ కిచెన్‌లో మొసలి ఉందనే వార్త తెలిసి అక్కడున్న జనం భయాందోళనకు గురయ్యారు. గుజరాత్‌లోని రావల్ గ్రామంలో జరిగింది ఈ ఘటన.

కిచెన్‌లో నక్కిన మొసలి ..
రావల్‌కి చెందిన రాధాబెన్ తన కుటుంబంతో హాయిగా జీవిస్తోంది. ఆమెకు నిమీషా అనే కూతురు ఉంది. అయితే ఇవాళ ఉదయం నిమీషాకు దాహమేసింది. నీళ్లు తాగుదామని వంట గదిలోకి వెళ్లిందామె. అయితే అక్కడ లైట్ వేయగానే మొసలి కనిపించింది. కళ్లు తూడుచుకొన్న .. మొసలే ఉంది. వెంటనే వామ్మో అంటూ పరుగుతీసింది. కిచెన్‌లో మొసలి ఉందనే విషయాన్ని తల్లికి చెప్పింది. అయితే నిమీషా మాటను తల్లి లెక్కచేయలేదు. అదేంటి వంటింట్లోకి మొసలి రావడం ఏంటని కొట్టిపారిసేంది.

crocodile come to kitchen room

లేదని .. చూసి నిర్ధారించుకుని ...
కూతురు అంత గట్టిగా చెబుతుంది కదాని కిచెన్‌లోకి వచ్చింది రాధాబెన్. అయితే అప్పుడే కదులుతున్న మొసలిని చూసి పై ప్రాణాలు పైనే పోయాయి ఆమెకు. దాని పొడవు 4.5 అడుగులు ఉందని .. అది ఎలా వచ్చిందో తెలియదని వివరించింది. బహుశ ఇంటికి సమీపంలో ఉన్న కుంట నుంచి వచ్చి ఉంటుందని పేర్కొంది. తమ కిచెన్‌లో ఉన్న కుండలోని నీళ్లుతాగేందుకు ప్రయత్నించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది. తాము వెంటనే మొసలిని గుర్తించి .. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చామని పేర్కొంది. చివరికి అధికారులు రెండుగంటలు కష్టపడి మొసలిని పట్టుకున్నారని తెలిపింది. తర్వాత అజ్వా సర్సులో వదిలిపెట్టామని .. అధికారులు వివరించడంతో రావెల్ గ్రామస్థులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

English summary
Radhaben of Rawal lives with her family. She has a daughter named Nimisha. But today morning Nimisha Go to the kitchen to drink water. There was a crocodile when there was light. Immediately came running. The mother told her that she had a crocodile in the kitchen. But Nimisha's mother did not count. The crocodile in the same coincides with what is going on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X