వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోట్లలో కొత్త కరెన్సీ ప్రింటింగ్ ...బ్యాంకులకు చేరనున్న కొత్త నోట్లు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూడిల్లీ :పెద్ద నగడు నోట్ల రద్దుతో ప్రజల ఇబ్బందులను తీర్చేందుకు కేంద్రం వేగంగా స్పందిస్తోంది. దేశ వ్యాప్తంగా అవసరమైన కొత్త కరెన్సీ నోట్లను ముద్రిస్తోంది. కోట్లాది రూపాయాల నగదును ముద్రిస్తున్నారు. ఈ నగదు బ్యాంకుల్లోకి చేరితే ప్రజల కష్టాలు తీరుతాయి.

నవంబర్ 8వ, తేదిన పెద్ద నగదు నోట్లను కేంద్రం రద్దుచేసింది.ఈ నగదు స్థానంలో కొత్త కరెన్సీని ప్రవేశపెట్టింది. కొత్త కరెన్సీ ప్రజలకు అందుబాటులోకి రాలేదు. దరిమిలా పరిమితసంఖ్యలోనే బ్యాంకులు, ఎటిఎంల ద్వారా కొత్త నగదును, చిల్లర నగదును డ్రా చేసుకొనే అవకాశం కల్పించారు.

దేశవ్యాప్తంగా అందరికీ ఇబ్బంది లేకుండా కొత్త కరెన్సీని అందుబాటులోకి తెచ్చేందుకు గాను ప్రింటింగ్ యంత్రాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి.భారతీయ రిజర్వ్ బ్యాంకు నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రోజుకు సుమారు 2వేల నోట్లను ముద్రిస్తున్నారు.18 లైన్లకు చెందిన 40 మిలియన్ల నోట్లను ముద్రిస్తున్నారు.

 crores of new currency priniting in various priniting press

ఈ ఒక్క ముద్రణ సంస్థలోనే కాదు బ్యాంక్ నోట్ ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ఐదువందల రూపాయాల నోట్లను 90 లక్షల నోట్లను ప్రింట్ చేస్తున్నారు. మరో వైపు నాసిక్ లో20 రూపాయాల నోట్లను 50 లక్షలను ముద్రిస్తున్నారు. వంద రూపాయాల నోట్లను కోటి ముద్రిస్తున్నారు.ఈనోట్లన్నీ ప్రజలకు అందుబాటులోకి వస్తే ఇబ్బందులు తప్పనున్నాయి.

English summary
central governament printing new currency in variouw places in the country. every day lakhs of currency printing in new currency.in bharat Reserve bank note mudran priniting new 2000 notes around 4 crores.new 500 rupees printing around 90 lakhs.100 rupees notes printing around 1 crore.50 lakhs worth of 20 rupees printing in nasik.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X