వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొండచరియల క్రింద ఉన్న మనిషిని సిఆర్‌పిఎఫ్ కుక్క ఎలా గుర్తుపట్టిందో తెలుసా... వీడీయో

|
Google Oneindia TeluguNews

జమ్ము,కశ్మీర్‌లో కురుస్తున్న వర్షాలకు కొండచరియలకు విరిగిపడ్డాయి. దీంతో ఓ వ్యక్తి వాటి క్రింద చిక్కుకున్నాడు. పూర్తిగా మట్టిలో కప్పుకుపోయాడు. తాను అక్కడ భూమిలో పాతుకుపోయినట్టు ఎవరికి తెలియని పరిస్థితి. దీంతో ఇక ప్రాణాలు గోవిందా అనుకునే సమయంలోనే ఓ కుక్క ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. కొండ చరియలు విరిగిపడడంతో సిఆర్ఫీఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీంతో సీఆర్పీఎఫ్ 72వ బెటాలియన్‌కు చెందిన ఓ కుక్క బురదలో కూరుకుపోయిన వ్యక్తిని పసిగట్టింది.

దీంతో హైవేలోని 147 మైలు రాయివద్ద బెటాలియన్‌కు చెందిన అజాక్సీ అనే ఓ కుక్క వ్యక్తిని పసిగట్టడడంతో సీర్పీఎఫ్ సిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని చూడడంతో సజీవంగా కనిపించాడు. దీంతో జవాన్లే స్వయంగా మట్టిని తవ్వి అతన్ని బయటకు తీశారు. అనంతంర ఆసుపత్రికి తరలించారు.

CRPF dog found a man trapped in debris

మరోవైపు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్థంభించింది. వర్షాలతో వాగులు వంకలు పొంగిర్లుతున్న నేపథ్యంలోనే శ్రీనగర్ హైవే సైతం మూసి వేశారు. విపరీతమైన వర్షాల నేపథ్యంలోనే శ్రీనగర్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

English summary
CRPF personnel of 72nd Battalion rescue a man trapped in landslide on Jammu-Srinagar highway near milestone 147.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X