• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ ఫోటో పాతదే? కేంద్రం ఏం చేస్తున్నట్లు.. నాలుగు రోజులైనా పట్టించుకోరా: రాకేశ్వర్ విడుదలపై కుటుంబ సభ్యులు

|

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-సుక్మా అడవుల్లో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 24 మంది జవాన్లు అమరులవగా... రాకేశ్వర్ సింగ్ మన్హాస్ బంధీగా మావోయిస్టులకు చిక్కిన సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా రాకేశ్వర్ సింగ్ మావోల నిర్బంధంలోనే ఉన్నాడు. ఈ విషయాన్ని మావోయిస్టు దండకారణ్య కమిటీ కూడా ఇప్పటికే ధ్రువీకరించింది. అయితే రాకేశ్వర్‌ను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గతంలో పౌర హక్కుల నేతలను పంపించి మావోయిస్టుల చెరలో ఉన్నవారిని విడిపించిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పౌర హక్కుల నేతలను ఆశ్రయిస్తుందా... లేక మరో మార్గాన్ని ఎంచుకుంటుందా అన్న దానిపై చర్చ జరుగుతోంది.

ప్లీజ్ నక్సల్ అంకుల్.. మా నాన్నను విడిచిపెట్టరా... మిస్సింగ్ సీఆర్పీఎఫ్ జవాన్ కూతురు విజ్ఞప్తి...ప్లీజ్ నక్సల్ అంకుల్.. మా నాన్నను విడిచిపెట్టరా... మిస్సింగ్ సీఆర్పీఎఫ్ జవాన్ కూతురు విజ్ఞప్తి...

కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు...

కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు...

రాకేశ్వర్ సింగ్ మన్హాస్ స్వరాష్ట్రం జమ్మూకశ్మీర్‌లో(ఏప్రిల్ 7) బుధవారం ఆయన కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు,స్థానికులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. బర్నాయ్‌లోని జమ్మూ-పూంచ్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో పాకిస్తాన్ మిలటరీకి చిక్కిన భారత వైమానిక దళ కమాండర్ అభినందన్ వర్థమాన్ విషయంలో కేంద్రం ఎలాంటి చొరవ చూపిందో... ఇప్పుడు రాకేశ్వర్ మన్హాస్ విషయంలోనూ అలాంటి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. రాకేశ్వర్‌ త్వరగా మావోయిస్టుల చెర నుంచి బయటపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. చేతుల్లో భారత జెండాను పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కేంద్రం ఏం చేస్తున్నట్లు : రాకేశ్వర్ భార్య మీనూ

కేంద్రం ఏం చేస్తున్నట్లు : రాకేశ్వర్ భార్య మీనూ

రాకేశ్వర్ మన్హాస్ భార్య మీనూ మన్హాస్ మాట్లాడుతూ.. తన భర్తను మావోయిస్టులు అపహరించి నాలుగు రోజులు గడుస్తున్నా... ఆయన విడుదల కోసం కేంద్రం నుంచి ఎటువంటి చర్యలు లేవన్నారు. కేంద్రం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. 'ఎవరైనా ఒక జవాను లీవు తర్వాత డ్యూటీకి గంట ఆలస్యంగా రిపోర్ట్ చేస్తే అతనిపై చర్యలు తీసుకుంటారు. అలాంటిది ఒక జవాను నాలుగు రోజులుగా కనిపించకుండా పోతే మాత్రం చర్యలు తీసుకోరా...?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ మీడియాలో వస్తున్న సమాచారమే తప్ప... కేంద్రం లేదా సీఆర్పీఎఫ్ నుంచి తమకెటువంటి సమాచారం అందలేదన్నారు.

ఆ ఫోటో పాతదేనా...?

ఆ ఫోటో పాతదేనా...?

రాకేశ్వర్ సింగ్ మన్హాస్ తమ వద్ద సురక్షితంగా ఉన్నాడని చెబుతూ మావోయిస్టులు అతని ఫోటో ఒకటి విడుదల చేశారు. ఓ తాటాకుల పందిరిలో కూర్చొని అతనేదో మాట్లాడుతున్నట్లు అందులో కనిపిస్తోంది. అయితే ఈ ఫోటో పాతదే అని రాకేశ్వర్ బంధువు ఒకరు పేర్కొనడం గమనార్హం. రాకేశ్వర్ చివరిసారి ఇంటికి వచ్చినప్పుడు ఈ ఫోటోను అతని సెల్‌ఫోన్‌లో చూసినట్లు జవాన్ బంధువు ప్రవీణ్ సింగ్ తెలిపారు.దీంతో మావోయిస్టులు విడుదల చేసిన ఫోటోపై కూడా చర్చ జరుగుతోంది. పాత ఫోటోను విడుదల చేయాల్సిన అవసరమేంటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్రం ఏం చేయబోతుంది?

కేంద్రం ఏం చేయబోతుంది?

రాకేశ్వర్ మన్హాస్ విడుదల కోసం కేంద్ర ప్రభుత్వం ఏ మార్గం ఎంచుకుంటుందన్నది ఇప్పటివరకూ వెల్లడికాలేదు. గతంలో ఒడిశాలో ఓ కలెక్టర్‌ను మావోయిస్టులు నిర్బంధించినప్పుడు... తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ హరగోపాల్,మరికొంతమంది పౌర హక్కుల నేతలు ప్రభుత్వం తరుపున మధ్యవర్తులుగా చర్చలకు వెళ్లారు. చర్చలు ఫలించడంతో కలెక్టర్‌ను మావోయిస్టులు సురక్షితంగా విడిచిపెట్టారు.

ఇప్పుడు రాకేశ్వర్ కోసం ప్రభుత్వం పౌర హక్కుల నేతలనే ఆశ్రయిస్తుందా లేక మరో మార్గం ఎంచుకుంటుందా అన్న దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు మావోయిస్టులతో చర్చలకు జైలు బంధీ విడుదల కమిటీ మధ్యవర్తిగా వ్యవహరించనుందన్న కథనాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికైతే అధికారిక సమాచారమేదీ ప్రభుత్వం వైపు నుంచి వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో రాకేశ్వర్ విడుదలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

English summary
“It’s been four days since my husband was abducted by the Maoists, but the government was doing nothing to ensure his release from captivity,” said Meenu, wife of Manhas, a member of the Commando Battalion for Resolute Action, popularly known as the CoBRA force of the CRPF, specialising in counter-insurgency operations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X