• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిఆర్‌పీఎఫ్ జవాన్లపై కశ్మీర్ ముస్లిం పోలీసు కాల్పులు... ? పుకార్లని కొట్టిపారేసిన సీఆర్‌పిఎఫ్

|

జమ్ము కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 తొలగింపు జరిగి వారం రోజుల గడుస్తున్నా అందరు ఊహించినట్టుగా ఎలాంటీ సంఘటనలు చోటు చేసుకోలేదు. చివరకు బక్రిద్ పండగ కూడ ప్రశాంతంగా కొనసాగింది. కాని కశ్మీర్‌లో అలజడి సృష్టించాలని భావిస్తున్న వేర్పాటు వాదులు, సోషల్ మీడీయాలో పుకార్లు పుట్టించారు. దీంతో ప్రజలను బయటకు రప్పించాలని ప్లాన్ వేశారు. అయితే స్థానిక భద్రతా దళాలు ఎలాంటీ కాల్పులు జరగలేదని తేల్చి చెప్పాయి.

కశ్మీర్‌లో పోలీసుల మధ్య కాల్పులు అంటూ వార్తలు

కశ్మీర్‌లో పోలీసుల మధ్య కాల్పులు అంటూ వార్తలు

జమ్మూకశ్మీర్‌ పోలీసులకు, సీఆర్పీఎఫ్‌ జవాన్లకు మధ్య ఘర్షణలు తలెత్తాయనే వార్తలు సోషల్ మీడీయాలో సోమవారం చక్కర్లు కొట్టాయి. కర్ఫ్యూ పాస్‌ లేదని ఓ గర్భిణీని భద్రతా దళాలు అడ్డుకోవడంతో రాష్ట్రంలోని ఓ ముస్లిం పోలీసు సిబ్బంది, సీఆర్పీఎఫ్‌ జవాన్ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిందని...దీంతో కశ్మీర్ ముస్లిం పోలీసు కాల్పులు జరపడంతో ఐదురుగు జవాన్లు చనిపోయారనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో కశ్మీర్‌లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అవన్ని పుకార్లు అంటూ కొట్టి పారేసిన సీఆర్‌పీఎఫ్

అవన్ని పుకార్లు అంటూ కొట్టి పారేసిన సీఆర్‌పీఎఫ్

అయితే, ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని సీఆర్పీఎఫ్‌‌తోపాటు కశ్మీర్‌ పోలీసులు కొట్టిపారేశారు.ఈ నేపథ్యంలోనే సోషల్ మీడీయాలో వచ్చే పుకార్లను నమ్మొద్దని ప్రకటించారు.. రక్షణ దళాలు దేశం కోసం.. సుహృద్భావ వాతావరణంలో పనిచేస్తాయని పేర్కోన్నారు. కోట్లాది భారతీయుల రక్షణ కోసం త్రివర్ణ పతాకం నీడలో తామంతా దేశ సేవకు అంకితమవుతామని.. తమ మధ్య ఎలాంటి భేదాలుండవని వెల్లడించారు. యూనిఫారమ్‌లు వేరైనా లక్ష్యం దేశ రక్షణే అంటూ సీఆర్పీఎఫ్‌ దళాలు ట్వీట్ చేశాయి

ఫేక్ ఐడిలు స‌ృష్టించి, తప్పుడు వార్తలు,

ఫేక్ ఐడిలు స‌ృష్టించి, తప్పుడు వార్తలు,

ఇక మరోవైపు కొందరు నకీలీ కశ్మీరీలు ఉన్నతాధికారుల పేర్లతో ఫేక్‌ అకౌంట్లు సృష్టించి, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని కశ్మీర్‌ పోలీస్‌ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొనడంతో కొన్ని దుష్ట శక్తులు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా కల్పనలో ఉండకుండా వాస్తవంలోకి రావాలని హితవు పలికారు.కాగా ఇప్పటికే వేలాదిగా భద్రతా దళాలు ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తున్న విషయం తెలిసిందే... దీంతో ఎక్కడ ఎలాంటీ హింసాయుతమైన సంఘటనలు చేసుకోలేదు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Jammu and Kashmir Police and the CRPF on Monday strongly refuted reports of a dispute between a Muslim Kashmiri policeman and CRPF personnel.A Twitter handle by the name of WSK had tweeted on Monday, "Rifts emerging among Indian security forces deployed in Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more