వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భద్రతా దళాలను తరలించేందుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు

|
Google Oneindia TeluguNews

పుల్వామా దాడి తర్వాత బలగాల తరలింపులో సిఆర్పిఎఫ్ పలు భద్రతా చర్యలు చేపట్టింది.ఇందుకోసం బుల్లేట్ ప్రూఫ్ వాహనాలు కోనుగోలు చేయడంతోపాటు బాంబు స్క్వాడ్ సిబ్బంది కూడ పెంచుతున్నారు, రోడ్డు మార్గంగుండా వెళ్లేటప్పుడు ఇతరవాహనాలను నిషేధించారు,మరోవైపు జవాన్లు విమానాల్లో కూడ వెళ్లేందుకు కేంద్రం అనుమతినిచ్చింది,

కాబోయే సీఎం.. జగన్: స్వీప్ చేయబోతున్నారు, ఎన్టీఆర్ విషయంలో ఇదే చెప్పా, రాసిపెట్టుకోండి: మోహన్ బాబు కాబోయే సీఎం.. జగన్: స్వీప్ చేయబోతున్నారు, ఎన్టీఆర్ విషయంలో ఇదే చెప్పా, రాసిపెట్టుకోండి: మోహన్ బాబు

సిఆర్పిఎఫ్ బలగాలకు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు

సిఆర్పిఎఫ్ బలగాలకు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారు సిఆర్పిఎఫ్ అధికారులు, పుల్వామాలో ప్రయాణిస్తున్న సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.ఆ కాల్పుల్లో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే, ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాల తరలింపులో మార్పులు తీసుకువస్తున్నట్టు సిఆర్ఫిఎఫ్ జనరల్ ఆర్.ఆర్. భట్నాగర్ తెలిపారు. లాండ్ మైన్ల పేలుడును తట్టుకునేందుకు బుల్లెట్ ఫ్రూఫ్ బస్సులను కొనుగోలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. కాగా ఈ బస్సుల్లో 30 మంది జవాన్లు ప్రయాణించేందుకు వీలుందని చెప్పారు.దీంతో చిన్న బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్స్ కూడ వారికి అందించనున్నట్టు ఆయన తెలిపారు.

చిన్న బస్సుల్లో ప్రయాణం

చిన్న బస్సుల్లో ప్రయాణం

పుల్వామా దాడికి ముందు సిఆర్పిఎఫ్ బలగాల తరలింపు కోసం పెద్ద బస్సులను ఉపయోగించేవారు, అందులో 50 మంది పైగా ప్రయాణించేవారు, దీంతో ఎదైన ప్రమాదం జరిగినా పెద్ద ఎత్తున మృతుల సంఖ్య రెట్టింపు సంఖ్యలో ఉంటుంది..దీంతో ముప్పై మంది మాత్రమే పట్టే బస్సులతోపాటు కేవలం ఆరుగురు మాత్రమే ప్రయాణించే చిన్న వాహనాలను కూడ సమకూర్చనున్నారు.దీంతో స్పీడ్ కూడ పెరగనున్నట్టు ఆయన తెలిపారు.దీంతో పాటు బాంబు స్క్వాడ్ సిబ్బంది కూడ పెంచడంతో పాటు భద్రతా దళాల తరలింపు లో కూడ పలు నిబంధనలు తీసుకువచ్చారు.

విమానాల్లో ప్రయాణించండి

విమానాల్లో ప్రయాణించండి

అయితే పుల్వామా దాడిని దృష్టిలో పెట్టుకుని జమ్ము కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లందరూ విమానాల్లో ప్రయాణించవచ్చని గతంలోనే హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. జవాన్లు విధుల్లో భాగంగా వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, సెలవుపై వెళ్తున్నప్పుడు, విధుల్లో చేరడానికి వస్తున్నప్పుడు అవసరమైనప్పుడల్లా విమానాల్లో ప్రయాణించవచ్చని ఆ శాఖ తెలిపింది.

English summary
CRPF To Get Mine Protected Vehicles, Smaller Buses To Boost Security,These new measures by the CRPF have been chalked out by the force in the aftermath of the February 14 Pulwama terror attack in which 40 soldiers were killed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X