వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అర్ధరాత్రి మంత్రి కార్యాలయంపై బాంబు దాడి
చెన్నై: తమిళనాడులోని మధురైలో రాష్ట్ర మంత్రి సెల్లూరు కె రాజు కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు మంత్రి కార్యాలయంపై పెట్రోలు బాంబు విసిరారు. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల కాలంలో తమిళనాడులోని చెన్నై సహా పలు ప్రాంతాల్లో బాంబు దాడులు కలకలం సృష్టిస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితమే మధురైలోని మీనాక్షి ఆలయ సమీపంలో పెట్రోలు బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి కార్యాలయంపై దాడి జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.