వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సరి-బేసి'కు ప్రతిపాదన: వారంలో ఒకరోజు 'వర్క్ ఫ్రం హోం'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి 'సరి-బేసి' నెంబర్ విధానం అమలు చేయనున్న నేపథ్యంలో జాతీయ శాస్త్ర-సాంకేతిక, అభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఎస్‌టీఏడీ-నిస్టాడ్‌) కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది.

ఈ ప్రతిపాదన ప్రకారం వారంలో ఒకరోజు (బుధవారం) విద్యార్థులు, ఐటీ రంగ నిపుణులకు 'వర్క్ ఫ్రం హోం' ఆప్షన్ ఇవ్వడం మంచిదని ఆ సంస్థ ఓ పరిష్కారంగా సూచించింది. దీన్ని ‘వర్చ్యువల్‌ అటెండెన్స్‌ ఎట్‌ వర్క్‌ అండ్‌ స్కూల్‌' (వీఏడబ్ల్యూఎస్‌)గా నిస్టాడ్‌ డైరెక్టర్‌ పి. గోస్వామి వివరించారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ పద్ధతిని ప్రవేశపెడితే కాలుష్యంతో పాటు ఒత్తిడి కూడా తగ్గి పని సామర్థ్యం, జీవన ప్రమాణాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం జనవరి 1 నుంచి అమలు చేయాలని భావిస్తున్న 'సరి-బేసి' నెంబర్ విధానం సక్సెస్ కాకపోవచ్చని మెక్సికో, బొగోటాల ఉదాహరించారు.

CSIR’s alternative to odd-even: Work from home Wednesdays

ఆయా దేశాల్లో 'సరి-బేసి' నెంబర్ విధానం ప్రవేశపెట్టినప్పుడు అక్కడి ప్రజలు రెండో కారు కోవడంతో కాలుష్యం మరింతగా పెరిగిందన్నారు. ఈ నిర్ణయంతో తగు మార్గదర్శకాలు జారీచేస్తే ‘వీఏడబ్ల్యూఎస్‌' విజయవంతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదలను ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోపాటు పీఎంఓతో సహా అన్ని మంత్రిత్వ శాఖలకు పంపామన్నారు.

ఇది ఇలా ఉంటే ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయనున్న 'సరి-బేసి' నెంబర్ విధానంపై మధ్యంతర నిలుపుదల ఉత్తర్వులకు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. జనవరి 1 నుంచి 15వరకు ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిని అమలు చేయాలన్న ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంపై ఐదు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

వీటిపై బుధవారం విచారణ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ జి.రోహిణి నేతృత్వంలోని ధర్మాసనం ఇంకా సరి-బేసి విధానం అమలు కానందువల్ల ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమంటూ విచారణను జనవరి 6కు వాయిదా వేసింది. కనీసం ఆ రోజువరకూ స్టే ఇవ్వాలన్న పిటిషనర్ల వినతిని కూడా ధర్మాసనం తోసిపుచ్చింది.

English summary
Ahead of Delhi’s proposed implementation of the odd-even scheme for cars plying on the city’s roads to control the alarming levels of pollution, an institute under Council of Scientific and Industrial Research (CSIR) has proposed an alternative solution to combat vehicular pollution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X