వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నమ్మండి ఇది నిజమే: భారీ అపార్ట్‌మెంట్‌పై నుంచి వాటర్ ఫాల్స్!(వీడియో)

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారుతోంది. మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలకు ముంబై రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేని వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాగ్రత్తగా ఉండాలూ ముంబై ప్రజలను అప్రమత్తం చేశారు నగర పోలీసు విభాగం.

భారత్‌పై తప్పుడు కూతలు కూసి అభాసుపాలు: పాక్ మాజీ రాయబారికి పోర్న్‌స్టార్ కృతజ్ఞతలు! భారత్‌పై తప్పుడు కూతలు కూసి అభాసుపాలు: పాక్ మాజీ రాయబారికి పోర్న్‌స్టార్ కృతజ్ఞతలు!

ఇది ఇలా ఉండగా, తాజాగా ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ ఆకట్టుకుంటోంది. భారీ వర్షాలతో ఓ అపార్ట్ మెంటుపై నుంచి ధారాళంగా పడుతున్న వర్షపు నీరు.. ఒక ఎత్తైన జలపాతంగా కనిపిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు.

Cuffe Parade skyscraper turns waterfall due to Mumbai rains. Crazy viral video

ఈ జలపాతం వీడియోను కే సుదర్శన్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో.. 'న్యూ కఫీ పరేడ్‌లో వాటర్ ఫాల్స్ #ముంబై రెయిన్స్'అనే హాష్‌ట్యాగ్‌తో పోస్టు చేశారు. న్యూ కుఫ్ఫే పరేడ్ అపార్ట్ మెంట్ నుంచి పడుతున్న వర్షపు నీరు ఇదొక వాటర్ ఫాల్స్ అన్నట్లు అనిపిస్తోంది.

అతను సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్టు చేసిన గంటలోనే 3వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. లైక్స్, రీట్వీట్లు వచ్చాయి. కొందరు నెటిజన్లు నమ్మకపోవడంతో.. ఇది నిజంగానే ఆ అపార్ట్‌మెంట్‌పైనుంచి పడుతున్న వర్షపు నీరే అని సుదర్శన్ సమాధానం ఇచ్చారు. కాగా, మరో రెండ్రోజులపాటు ముంబైలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతూ వాతావరణ శాఖ నగరవాసులను అప్రమత్తం చేసింది.

English summary
It is pouring in Mumbai and as the Maharashtra capital is battling torrential rains, a video of a building at New Cuffe Parade is swiftly going viral. But, wait for the twist. As a result of the heavy rains, water is seen gushing down the skyscraper so much so that it resembles a waterfall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X