చెప్పింది చేస్తున్న అక్బరుద్దీన్! ఔరంగాబాద్‌లో(పిక్చర్స్)
హైదరాబాద్/ఔరంగాబాద్: మహారాష్ట్ర థానే పోలీసులు మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. మంగళవారం ఔరంగాబాద్ పోలీసులు కూడా నోటీసులు పంపించారు. అక్బరుద్దీన్ మంగళవారం ఔరంగాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నోటీసులు అందించారు. బహిరంగ సభల్లో పాల్గొనవద్దని, రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
నోటీసు పైన అక్బరుద్దీన్ ఘాటుగానే స్పందించారు. ప్రజాప్రతినిధిగా తాను వెళ్తానని, సభల్లో పాల్గొంటానని చెప్పారు. ఔరంగాబాదులో అక్బర్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఔరంగాబాద్ నుండి ముంబైకి వెళ్లి అక్కడ పార్టీ మద్దతుదారులు ఇచ్చే ఇఫ్తార్ విందులో పాల్గొంటారని తెలుస్తోంది.
కాగా, థానే పోలీసులు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా అక్బర్ స్పందించారు. ప్రజాప్రతినిధిగా తనకు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని, అడ్డుకుంటే న్యాయపరంగా పోరాటం చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆయన.. చెప్పినట్లుగానే మహారాష్ట్రకు వెళ్లారు.
అక్బరుద్దీన్
మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మంగళవారం మహారాష్ట్రలోని ఔరంగాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యం.
అక్బరుద్దీన్
మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మంగళవారం మహారాష్ట్రలోని ఔరంగాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మద్దతుదారులు స్వాగతం పలుకుతున్న దృశ్యం.
అక్బరుద్దీన్
మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మంగళవారం మహారాష్ట్రలోని ఔరంగాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మద్దతుదారులు స్వాగతం పలుకుతున్న దృశ్యం.
అక్బరుద్దీన్
మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మంగళవారం మహారాష్ట్రలోని ఔరంగాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన మద్దతుదారులు.
అక్బరుద్దీన్
మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మంగళవారం మహారాష్ట్రలోని ఔరంగాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన మద్దతుదారులు.
అక్బరుద్దీన్
మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మంగళవారం మహారాష్ట్రలోని ఔరంగాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. హాజరైన మద్దతుదారులు.
అక్బరుద్దీన్
మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మంగళవారం మహారాష్ట్రలోని ఔరంగాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రార్థన చేస్తున్న దృశ్యం.