వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అహ్మదాబాద్‌లో మళ్లీ కర్ఫ్యూ, రాత్రి నుంచి ఉదయం వరకు, ఎందుకంటే..?

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర పరిధిలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌తోపాటు నగరంలో ఒక్కసారిగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఈ కర్ఫ్యూ నిబంధనలు నవంబర్ 20 నుంచి అమల్లోకి రానున్నాయి. గుజరాత్ వైద్య ఆరోగ్య తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ నగరంలో ఇప్పటి వరకు 45వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 40వేల మంది కరోనా నుంచి కోలుకోగా.. 2వేల మరణాలు సంభవించాయి.

Curfew from 9pm to 6am as Covid-19 cases rise in Gujarats Ahmedabad

ప్రస్తుతం గుజరాత్ రాస్ట్రంలో 12,457 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 69,78,249 నమూనాలను పరీక్షించారు. పండగ రోజుల నేపథ్యంలో అహ్మదాబాద్ నగరంలో కరోనా కేసులు పెరిగాయి. గత కొద్ది వారాలుగా నగరంలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలను ప్రజలు పాటించకపోవడం వల్లే కరోనా కేసులు పెరిగాయని అధికారులు చెబుతున్నారు.

అహ్మదాబాద్‌లో 2,800 కు పైగా ఖాళీ పడకలు ఉన్నాయి, ఇవి నగరం మొత్తం పడకలలో 40 శాతం ఉన్నాయి. అహ్మదాబాద్ నగరం 900 మొబైల్ మెడికల్ వ్యాన్లు, 550 కరోనా సంజీవనివన్ వ్యాన్లతో పాటు 150 దన్వంత్రి మొబైల్ మెడికాన్ వ్యాన్లను ఉపయోగిస్తోంది, '104 జ్వరం సహాయం '100 వ్యాన్లు, మరో 100 వాడిల్ సుఖకారి యోజన వ్యాన్లు కరోనావైరస్ వ్యాప్తిని తనిఖీ చేయడానికి పనిచేస్తున్నాయి.

అదనంగా, అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నగరం అంతటా 200 కేంద్రాలను ఏర్పాటు చేసింది, ఇక్కడ ప్రజలు ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చు.

English summary
Ahmedabad Municipal Corporation has decided to impose a curfew between 9 pm and 6 am to curb the sudden spike in coronavirus cases in the capital city of Gujarat. This curfew will come into effect starting Friday (November 20).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X