వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ కాశ్మీర్ లో గొడవలు, కర్ఫ్యూ

|
Google Oneindia TeluguNews

జమ్మూ: జమ్మూ- కాశ్మీర్ లో శాంతిభద్రతలకు భంగం కలిగింది. మత ఘర్షణలు అదుపు చెయ్యడానికి వెళ్లిన పోలీసులకు తీవ్రగాయాలు కావడంతో అధికారులు కర్ఫ్యూ విధించారు. ముందు జాగ్రతగా పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జమ్మూ- కాశ్మీర్ లోని సాంబా జిల్లాలోని రాయమోర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం మత ఘర్షణలు చెలరేగాయి. రెండు వర్గాల మద్య చిచ్చు రగిలింది. అదే సమయంలో జిల్లా మేజిస్ట్రేట్ వాహనంపై ఆందోళనకారులు దాడులు చేశారు.

మేజిస్ట్రేట్ వాహనం పూర్తిగా దెబ్బతినిందని పోలీసు అధికారులు తెలిపారు. పలు ప్రభుత్వ వాహనాలపైన దాడులు చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసు అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకున్నారు.

Curfew Imposed in Samba district in Jammu and Kashmir

గురువారం సాయంత్రం బారి బ్రాహ్మణ ప్రాంతంలో మత గ్రంధాలయం మీద పలు ఆరోపణలు రావడంతో రెండు వర్గాల మద్య గొడవలు మొదలైనాయి. ఇరు వర్గాలు నిరసన వ్యక్తం చేస్తు జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం చేరుకున్నారు.

అక్కడ ఇంకా గొడవ ఎక్కువ కావడంతో ఇరు వర్గాల వారు ప్రభుత్వ వాహనాలు ద్వంసం చేసి పోలీసుల మీద దాడులు చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Curfew was imposed in Samba district after violence erupted there following alleged religious sacrilege by members of one community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X