బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: శనివారం రాత్రి నుంచి కర్ఫ్యూ అమలు, ఎందుకంటే ? తిక్క చేష్టలు చేస్తే అంతే, ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) అరికట్టడంలో భాగంగా దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ 4.0 జారీ అయిన తరువాత కేంద్ర ప్రభుత్వం కొన్ని నియమాలతో సడలింపులు ఇచ్చింది. మద్యం షాపులతో పాటు, పలు దుకాణాలు, వ్యాపారాలు జరుగుతున్నాయి. ఐటీ, బీటీ దేశ రాజధాని బెంగళూరు నగరంలో సిటీ బస్సులతో పాటు అనేక వ్యాపారలావాదేవీలు జరుగుతున్నాయి. అయితే శనివారం రాత్రి 7 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు బెంగళూరు నగరంలో కర్ఫ్యూ అమలులో ఉంటుందని సిటీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ ఆదేశాలు జారీ చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో తప్పా ప్రజలు ఎవ్వరూ రోడ్ల మీదకు రాకూడదని, లాక్ డౌన్ సడలింపులు ఈ మధ్య కాలంలో వర్తించవని, ఎవరైనా నియమాలు ఉల్లంఘించి తిక్క చేష్టలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ హెచ్చరించారు. శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కర్ఫ్యూ అమలు చెయ్యడానికి ఓ లెక్క ఉందని అధికారులు అంటున్నారు.

Lockdown: కాలేజ్ అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్, బీర్లు, బిరియానీలు, బ్లాక్ మెయిల్ !Lockdown: కాలేజ్ అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్, బీర్లు, బిరియానీలు, బ్లాక్ మెయిల్ !

 కచ్చితంగా సహకరించాలి

కచ్చితంగా సహకరించాలి

బెంగళూరులో శనివారం రాత్రి 7 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు బెంగళూరు నగరంలో కర్ఫ్యూ అమలులో ఉంటుందని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ అన్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎలా సహకరిచారో అలాగే శనివారం రాత్రి 7 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ప్రజలు అందరూ కర్ఫ్యూకు సహకరించాలని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ ప్రజలకు మనవి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా ప్రజలు ఎవ్వరూ రోడ్ల మీదకు రాకూడదని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ సూచించారు.

 బస్సులు, క్యాబ్ లు, ఆటోలకు బ్రేక్

బస్సులు, క్యాబ్ లు, ఆటోలకు బ్రేక్

బెంగళూరు నగరంలో శనివారం రాత్రి 7 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ప్రజలు అందరూ కర్ఫ్యూ అమలులో ఉంటుందని, ఆ మధ్యకాలంలో సిటీలో ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులతో పాటు ఆటోలు, క్యాబ్ లు సంచరించవని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ చెప్పారు.

 మందు, మటన్, చికెన్ బంద్

మందు, మటన్, చికెన్ బంద్

ఆదివారం మద్యం షాపులతో పాటు మటన్, చికెన్, మాంసాహారం విక్రయించరాదని, అలా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సిటీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ హెచ్చరించారు. మాంసాహార దుకాణాల దగ్గర ప్రజలు గుంపులు గుంపులుగా చేరే అవకాశం ఉండటంతో ఆదివారం అన్ని వ్యాపారాలు మూసివేయాలని బెంగళూరు సిటీ పోలీసులు నిర్ణయించారు.

 వీటికే మాత్రం ఓకే

వీటికే మాత్రం ఓకే

నిత్యవసర వస్తువులు విక్రయించే షాపులు, మెడికల్ షాపులు, ఆసుపత్రులు, పాలు మాత్రం విక్రయించడానికి అవకాశం ఇచ్చామని, మిగిలిన అన్ని వ్యాపారలావాదేవీలు నిలిపివేయాలని భాస్కర్ రావ్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో మాకు ఆవస్తువులు కావాలి, ఈ వస్తువులు కావాలి అంటూ అనవసరంగా ఎవరైనా రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ హెచ్చరించారు.

 ప్రభుత్వం చెప్పింది, మనం పాటించాలి !

ప్రభుత్వం చెప్పింది, మనం పాటించాలి !

లాక్ డౌన్ 4.0 నియమాలను కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిందని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ అన్నారు. లాక్ డౌన్ సమయంలో కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలను, సూచనలను ప్రజలు పాటించాలని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ ప్రజలకు మనవి చేశారు. బెంగళూరులొ కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో నగర ప్రజలు పోలీసులకు సహకరించాలని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ మనవి చేశారు.

 కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ !

కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ !

లాక్ డౌన్ నియమాలను పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సక్రమంగా పాటించడం లేదని కేంద్ర ప్రభుత్వ హోమ్ శాఖ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో అనేక రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోమ్ శాఖ లేఖలు రాసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బెంగళూరు నగరంలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

Recommended Video

Lockdown : Ramadan Festival Sales Fall Down @ Charminar Due To Corona Lockdown
రంగంలోకి అదనపు బలగాలు

రంగంలోకి అదనపు బలగాలు

బెంగళూరు నగరంలో శనివారం రాత్రి 7 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు కట్టుదిట్టంగా కర్ఫ్యూ అమలు చెయ్యడానికి అదనపు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చెయ్యడానికి పోలీసు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. కర్ఫ్యూ నియమాలు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వంతో పాటు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ హెచ్చరించారు.

English summary
Lockdown Curfew: Bengaluru city commissioner of police Bhaskar Rao said that curfew will imposed in city from May 23 7 pm to May 25 7 am. No relaxation in lockdown rules on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X