బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పౌరసత్వ చట్టం ఎఫెక్ట్, కర్ఫ్యూకు బ్రేక్, మాజీ సీఎం సిద్దూకు నో ఎంట్రీ, బెంగళూరులో !

|
Google Oneindia TeluguNews

మంగళూరు/బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కర్ణాటకలోని మంగళూరు నగరంలో ఆందోళనలు తారాస్థాయికి చేరడంతో కర్ఫ్యూ విధించారు. పరిస్థితి అదుపులోకి రావడంతో శనివారం మద్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలించారు. కర్ఫ్యూతో పాటు 144 సెక్షన్ సైతం మూడు గంటల పాటు ఎత్తివేశారు. స్థానికులు నిత్యవసరవ వస్తువులు కొనుగోలు చెయ్యడానికి అవకాశం కల్పిస్తూ మూడు గంటల పాటు కర్ఫ్యూను సడలించామని మంగళూరు నగర పోలీసు కమిషనర్ పీఎస్. హర్షా తెలిపారు. బెంగళూరులో గత రెండు రోజులుగా అమలులో ఉన్న 144 సెక్షన్ ను పరిస్థితులు పరిశీలించిన తరువాత కొనసాగించే విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ తెలిపారు.

పెళ్లి కాని ఆంటీ, ఎర్రగా బుర్రగా బలంగా ఉందని, దుబాయ్ లో కంపెనీలు, ఎండీకి పంగనామాలు, ఎస్కేప్!పెళ్లి కాని ఆంటీ, ఎర్రగా బుర్రగా బలంగా ఉందని, దుబాయ్ లో కంపెనీలు, ఎండీకి పంగనామాలు, ఎస్కేప్!

 నిత్యవసర వస్తువులు

నిత్యవసర వస్తువులు

నిత్యవసర వస్తులు కొనుగోలు చెయ్యడానికి స్థానికులకు అవకాశం కల్పిస్తూ శనివారం మద్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలించామని మంగళూరు నగర పోలీసు కమిషనర్ పీఎస్. హర్షా మీడియాకు చెప్పారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో పోలీసులు నగరంలోని అనేక సున���నితమైన ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

 హింసాత్మక సంఘటనలు

హింసాత్మక సంఘటనలు

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై మంగళూరు నగరంలో ఆందోళనలు తారాస్థాయికి చేరడంతో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సమయంలో ఆందోళనకారులను అదుపుచెయ్యడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. పలువురికి తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి మరింత విషమించడంతో మంగళూరు నగరంలో కర్ఫ్యూ విధించా���ు. అయితే శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి పూర్తిగా కర్ఫ్యూ అమలులో ఉంటుందని మంగళూరు నగర పోలీసు కమిషనర్ పీఎస్. హర్షా తెలిపారు.

 బెంగళూరులో

బెంగళూరులో

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆందోళనలు నివారించడానికి బెంగళూరు నగరంలో గత రెండు రోజుల నుంచి 144 సెక్షన్ అమలులో ఉంది. అయితే డిసెంబర్ 21వ తేదీ తరువాత 144 సెక్షన్ పొడిగించమని, పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని బెం���ళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ తెలిపారు.

మాజీ సీఎం సిద్దూకు చెక్

మాజీ సీఎం సిద్దూకు చెక్

మంగళూరు నగరంలో పోలీసు కాల్పుల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎట్టిపరిస్థితుల్లో మీరు మంగళూరులో అడుగుపెట్టడానికి వీల్లేదని మాజీ సీఎం సిద్దరామయ్యకు మం��ళూరు నగర పోలీసు కమిషనర్ పీఎస్. హర్షా నోటీసులు జారీ చేశారు.

 బస్సు, రైలు, విమానం

బస్సు, రైలు, విమానం

బస్సు, కారు, రైలు, విమానంతో పాటు ఏ వాహనంలో ప్రయాణించి మీరు మంగళూరు నగరంలో అడుగుపెట్టడానికి వీలులేదని మాజీ సీఎం సిద్దరామయ్యకు మంగళూరు నగర పోలీసు కమిషనర్ పీఎస్. హర్షా నోటీసులు జారీ చేశారు. మీరు మంగళూరులో అడుగుపెడితే శాంతిభద్రతలకు భంగం కలుగుతోందని, అ���దుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని పోలీసు కమిషనర్ పీఎస్. హర్షా సిద్దరామయ్యకు వివరించారు. పోలీసుల తీరుపై మాజీ సీఎం సిద్దరామయ్య మండిపడుతున్నారు. మరోవైపు మంగళూరులో ప్రవేశించడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు రమేష్ కుమార్, ఎంబీ పాటిల్ తదితరులు మంగళూరు ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
Curfew will be relaxed in Mangaluru city from 3 pm to 6 pm today. Section 144 will also be relaxed from 3 pm to 6 pm. Curfew will be imposed again post 6 pm for the entire night. Mangaluru police gives Siddaramaiah notice not to enter Mangaluru till 23rd December.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X