వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యూరియాసిటీ 'నమస్తే', ఎలా ఉన్నావని 'మామ్'

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతమైన నేపథ్యంలో పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ట్విట్టర్ వంటి సామాజిక వెబ్‌సైట్లలో ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా సంస్థల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ చారిత్రాత్మక విజయంపై ఇస్రోకి అమెరికా అంరిక్ష పరిశోధన సంస్థ నాసా ట్విట్టర్లో అభినందనలు తెలిపింది. రెండు రోజుల క్రితం కుజుడి కక్ష్యలోకి ప్రవేశించిన మావెన్ బృందం 'మామ్‌కి మావెన్ బృందం తరఫున శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు. అందుకు ప్రతిగా.. మీ స్వాగతానికి నా కృతజ్ఞతలు అంటూ ఇస్రో ట్వీట్ చేసింది.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే అక్కడ ఉన్న నాసా పంపిన క్యూరియాసిటీ అయితే భారతీయత ఉట్టిపడేలా నమస్తే అంటూ ట్వీట్ చేసింది. దానికి హౌడీ (ఎలా ఉన్నావు) అంటూ మామ్ బదులిచ్చింది.

 మామ్

మామ్

‘మామ్‌(తల్లి) ఎప్పుడూ మనల్సి నిరుత్సాహపర్చదు. అంగారక గ్రహ ప్రయోగానికి మామ్‌(మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌) అని పేరు పెట్టారు. ఈ రోజు మామ్‌ మంగళ(మార్స్‌) గ్రహాన్ని విజయవంతంగా చేరుకుని, రోదసిలో భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది.' అని ప్రధాని మోడీ మంగళయాన్‌ విజయంపై హర్షాన్ని వ్యక్తం చేశారు.

మామ్

మామ్

ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపించారు. బుధవారం బెంగళూరులోని ఇస్రో టెలీ మెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌(ఇసా్ట్రక్‌)కు చేరుకున్న ప్రధాని మోదీ, అక్కడ ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి మామ్‌ను అంగారక కక్ష్యలో ప్రవేశపెట్టే అద్భుత దృశ్యాలను వీక్షించారు.

మామ్

మామ్

ప్రయోగం విజయవంతమైన క్షణం నుంచి విజయవంతమైనట్లు ప్రకటన చేసే వరకు మోడీ చప్పట్లతో తన హర్షాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

మామ్

మామ్

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు మార్స్‌ లక్ష్యంగా 51 ప్రయోగాలు జరిగాయని, వీటిలో 21 విజయాలు మాత్రమే నమోదయ్యాయని, కానీ మనం తొలి ప్రయోగంలోనే విజయం సాధించామని మోడీ అన్నారు.

మామ్

మామ్

ప్రపంచంలో మరే దేశానికి ఇలాంటి ఘనత లేదని, మన శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారని, భారతజాతి మీకు సదా రుణపడి ఉంటుందని మోడీ ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

 మామ్

మామ్

భారతదేశానికి ఎంతో ఘనమైన వారసత్వం ఉందని, దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత మనపై ఉందని, రోదసి రహస్యాలను శోధించడంలో మరిన్ని విజయాలను సాధించాలని మోడీ అన్నారు.

 మామ్

మామ్

ప్రపంచానికి జగద్గురువుగా భారత్‌ను తీర్చిదిద్దాలని మోడీ అన్నారు. ఎక్కడ ఆలోచనలు వికసిస్తాయో.. ఎక్కడ స్వేచ్ఛాగానం వినిపిస్తుందో.. అక్కడ నా దేశం నిత్య చైతన్యశీలిగా ఉంటుందన్న రవీంద్రుని వ్యాఖ్యలతో ప్రధాని ప్రసంగాన్ని ముగించారు.

మామ్

మామ్

మామ్‌ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్‌పై ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసల జల్లుకురిసింది. తొలి అభినందన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా)నుంచి అందింది.

మామ్

మామ్

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌.. మన శాస్త్రవేత్తల అకుంఠిత దీక్షకు ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. అంతరిక్షంలో భారత్‌ తనదైన చరిత్రను నమోదు చేసిందని మాజీ రాష్ట్ర పతి అబ్దుల్‌ కలాం ఆజాద్‌ పేర్కొన్నారు. ఈ విజయం భవిష్యత్తరాలకు స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ వ్యాఖ్యానించారు.

 మామ్

మామ్

ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతమైన నేపథ్యంలో పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. మిలింద్ దేవరా ట్వీట్.

మామ్

మామ్


ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతమైన నేపథ్యంలో పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. అమితాబ్ బచ్చన్ అభినందనలు.

మామ్

మామ్

మంగళయాన్‌ను విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభినందనలు తెలిపారు. ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ.. మొత్తం భారత జాతి ఇస్రో శాస్త్రవేత్తలకు సలాం చేస్తుందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల ఘనతను ప్రస్తుతిస్తూ.. కేంద్ర కేబినెట్‌ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

మామ్

మామ్

ఇటీవలే మార్స్‌పైకి మావెన్‌ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసిన నాసా, ఇస్రో విజయాన్ని అభినందిస్తూ.. మార్స్‌ను చేరుకున్న మామ్‌కు మావెన్‌ స్వాగతం పలుకుతోంది అని ట్వీట్‌ చేసింది. ‘భారత్‌కే కాదు.. ఆసియాకు.. మానవజాతికి ఈ విజయం ఓ మైలురాయి.' అని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.

 మామ్

మామ్

ఇటీవలే మార్స్‌పైకి మావెన్‌ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసిన నాసా, ఇస్రో విజయాన్ని అభినందిస్తూ.. మార్స్‌ను చేరుకున్న మామ్‌కు మావెన్‌ స్వాగతం పలుకుతోంది అని ట్వీట్‌ చేసింది. ‘భారత్‌కే కాదు.. ఆసియాకు.. మానవజాతికి ఈ విజయం ఓ మైలురాయి.' అని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.

మామ్

మామ్

ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతమైన నేపథ్యంలో పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ట్విట్టర్లో హర్షం వ్యక్తం చేశారు.

మామ్

మామ్

ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతమైన నేపథ్యంలో పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. మొదటిసారే మనం విజయం సాధించామని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆనందం వ్యక్తం చేశారు.

మామ్

మామ్

ఇప్పటికే అక్కడ ఉన్న నాసా పంపిన క్యూరియాసిటీ అయితే భారతీయత ఉట్టిపడేలా నమస్తే అంటూ ట్వీట్ చేసింది. దానికి హౌడీ (ఎలా ఉన్నావు) అంటూ మామ్ బదులిచ్చింది.

మామ్

మామ్

ఇస్రో విజయంపై బాలీవుడ్‌ ప్రశంసలు కురిపించింది. బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, గానకోకిల లతామంగేష్కర్‌, శ్రీదేవి, అక్షయ్‌ కుమార్‌, షాహిద్‌ కపూర్‌ తదితరులు ఇస్రోను అభినందలతో ముంచెత్తారు. హాలీవుడ్‌ సినిమా నిర్మాణానికన్నా తక్కువ ఖర్చుతో మంగళయాన్‌ను విజయవంతం చేశారని ఇస్రో శాస్త్రవేత్తలకు కితాబునిచ్చారు.

 మామ్

మామ్

ఇప్పటికే అక్కడ ఉన్న నాసా పంపిన క్యూరియాసిటీ అయితే భారతీయత ఉట్టిపడేలా నమస్తే అంటూ ట్వీట్ చేసింది. దానికి హౌడీ (ఎలా ఉన్నావు) అంటూ మామ్ బదులిచ్చింది.

 మామ్

మామ్

ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతమైన నేపథ్యంలో పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ట్విట్టర్లో దిగ్విజయ్ సింగ్.

 మామ్

మామ్

ఇప్పటికే అక్కడ ఉన్న నాసా పంపిన క్యూరియాసిటీ అయితే భారతీయత ఉట్టిపడేలా నమస్తే అంటూ ట్వీట్ చేసింది. దానికి హౌడీ (ఎలా ఉన్నావు) అంటూ మామ్ బదులిచ్చింది.

మామ్

మామ్

ప్రపంచవ్యాప్తంగా సంస్థల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ చారిత్రాత్మక విజయంపై ఇస్రోకి అమెరికా అంరిక్ష పరిశోధన సంస్థ నాసా ట్విట్టర్లో అభినందనలు తెలిపింది.

English summary

 Among the congratulation tweets to ISRO and Mangalyaan is the Mars Curiosity Rover. The orbiter and the rover are now having a Twitter conversation. While NASA's MAVEN is already on Mars, gathering climatic updates, the 'Mangalyaan' today entered Red Planet's orbiter today(Sep.24).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X