వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద నగదు నోట్ల రద్దుతో తగ్గిన సిగరెట్ల విక్రయాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

డెహ్రడూన్ :పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం పలు వ్యాపారాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ప్రధానంగా సిగరెట్ల విక్రయాలు గణనీయంగా పడిపోయాయని ఓ సర్వే వెల్లడించింది.ప్రాణాలకు ఇబ్బందిని కల్గించే సిగరెట్లను తాగవద్దని ఎంత చెప్పినా వివని వారు చేతిలో చిల్లర లేని కారణంగా సిగరెట్లను కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది.

పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా కొత్త నగదు కోసం, చిల్లర మార్పిడి కోసం ప్రజలు కష్టాలుపడుతున్నారు. చిల్లర లేక నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. చిల్లర కష్టాలతో సిగరెట్టు అమ్మకాలు విపరీతంగా పడిపోయాయని సర్వే తేల్చింది.

cigarette

పదిరోజుల్లో సిగరెట్టు కొనుగోళ్ళు 40 శాతం తగ్గిపోయాయని వ్యాపారస్థులు చెబుతున్నారని ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వే వెల్లడించింది.చిల్లర లేక సిగరెట్లు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు తంటాలు పడుతున్నారని ఆ సర్వే తేల్చింది.

పెద్ద నగదునోట్ల రద్దు కారణంగా కొన్ని షాపుల్లో సగానికి పైగా విక్రయాలు పడిపోయాయి. సిగరెట్టు కాల్చేవారు ఒక్క సిగరెట్టుతోనే సరిపెట్టుకొంటున్నారు.చిల్లర కష్టాలు ఇలానే కొనసాగితే సిగరెట్టును కొందరు మానివేసే పరిస్థితుుల కూడ ఉండవచ్చని కొందరు సర్వేలో అభిప్రాయపడ్డారు.

English summary
central governament decission on currency ban effect sales fo cigarettes. decrease sales of cigarette around 40 percent report a survey.national media survey about sales of cigarettes.half of sales decreses said a shop owner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X