వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 28కోట్ల అత్యంత ఖరీదైన వాచ్ లు కస్టమ్స్ అధికారులు స్వాధీనం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు దాదాపు 27.09 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు పొదిగిన బంగారంతో తయారుచేసిన కస్టమైజ్డ్ చేతి గడియారాన్ని సీజ్ చేశారు. దీనితోపాటు మరో ఆరు లగ్జరీ హ్యాండ్ వాచ్ లను స్వాధీనం చేసుకొని, వీటిని స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీ విమానాశ్రయంలో 28కోట్ల విలువైన వాచ్ లు సీజ్

ఢిల్లీ విమానాశ్రయంలో 28కోట్ల విలువైన వాచ్ లు సీజ్


సీజ్ చేసిన వాచీల విలువ సుమారు 60 కిలోల బంగారంతో సమానం అని అధికారులు చెబుతున్నారు. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో అత్యంత విలువైన 28 కోట్ల రూపాయల వాచ్ లను స్వాధీనం చేసుకున్న తర్వాత కస్టమ్స్ కమిషనర్ జుబైర్ రియాజ్ కమిలీ మాట్లాడుతూ, విలాసవంతమైన, అత్యంత విలువైన వస్తువులనును సీజ్ చేసిన అతి పెద్ద కేసుగా దీనిని పేర్కొన్నారు. నిందితుడైన ప్రయాణికుడు భారతీయుడని, అతను దుబాయ్ నుండి పరిమితికి మించి ఎడిషన్ జాకబ్ అండ్ కో బిలియనీర్ వైట్ డైమండ్స్ వాచ్, ఆరు ఖరీదైన రోలెక్స్, పియాజెట్ వాచీలు, డైమండ్ పొదిగిన బ్రాస్లెట్ లు, ఐఫోన్ 14 తీసుకువచ్చారని, తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

ఢిల్లీలో ఓ క్లయింట్ కు డెలివరీ కోసం వచ్చిన నిందితుడు


జాకబ్ & కో యొక్క ఒక వాచీ విలువ రూ. 27.09 కోట్లు ఉంటుందని పేర్కొంది. నిందితుడు, అతని మామ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని పలు ప్రదేశాలలో బ్రాంచ్‌లతో దుబాయ్‌లో ఖరీదైన గడియారాల రిటైల్ అవుట్‌లెట్‌ను కలిగి ఉన్నారని కస్టమ్స్ అధికారి తెలిపారు. నిందితుడు వాటిని ఢిల్లీలోని ఒక ప్రముఖ క్లయింట్‌కు డెలివరీ చేయడానికి తీసుకువెళుతున్నాడని పేర్కొన్నారు. నిందితుడు గుజరాత్ రాష్ట్రానికి చెందిన క్లయింట్‌ని ఢిల్లీలోని ఫైవ్‌స్టార్ హోటల్‌లో కలవాల్సి ఉండగా, క్లయింట్ సమావేశానికి రాలేదని , నిందితుడు కూడా క్లయింట్ పేరు వెల్లడించకపోవడంతో క్లైంట్ ఎవరు అనేది తెలియడం లేదని పేర్కొన్నారు.

కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం నిందితుడిపై కేసు నమోదు

కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం నిందితుడిపై కేసు నమోదు

క్లయింట్ పేరు చెప్పడానికి నిందితుడు భయపడుతున్నారని కస్టమ్స్ అధికారులు వెల్లడిస్తున్నారు. రికవరీ చేయబడిన వస్తువులు కస్టమ్స్ చట్టం 1962 లోని సెక్షన్ 110 కింద సీజ్ చేయబడ్డాయి అని పేర్కొన్నారు. ఇక నిందితుడిని కస్టమ్స్ చట్టం 1962 సెక్షన్ 104, సెక్షన్ 135 ప్రకారం అరెస్టు చేసినట్టుగా వెల్లడించారు. ఇతర దేశాల నుండి భారతదేశంలోకి అనుమతి లేకుండా బంగారం, వజ్రాలను స్మగ్లింగ్ చేయడం నాన్ బెయిలబుల్ నేరం కింద వస్తుందని పేర్కొన్నారు.

English summary
Customs officials seized the most expensive watches worth 28 crores at Delhi International Airport. It is said that the value of these is equal to 60 kg of gold.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X