వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుక్క కరిచిందని అతనే ఏం చేశాడంటే, భార్యను తలకిందులుగా వేలాడదీశాడు

కుక్క కరిచిందని ప్రమోద్ అనే వ్యక్తి ఆ కుక్క రెండుకాళ్ళను నరికేశాడు. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకొంది. గతంలో ఇతనే ఓ కోతిని కూడ ఇదే రకంగా నరికేశాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :తనను కుక్క కరిచిందనే నెపంతో ఓ వ్యక్తి ఆ కుక్క రెండు కాళ్ళను కోసి తన కసిని తీర్చుకొన్నాడు. ఇతనే గతంలో ఓ కోతిని తీసుకు వచ్చి నరికేశాడు. జంతువుల హక్కుల కార్యకర్తలు అతడిపై ఫిర్యాదు చేశారు. మరో వైపు నిందితుడి భార్య కూడ మద్యం మత్తులో ఆయన చేసే ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

న్యూఢిల్లీలో నివాసం ఉండే ప్రమోద్ ను ఓ వీధికుక్క కరిచింది. ప్రమోద్ కుక్కను పిలిచి మరీ కొంత ఆహారం వేశాడు. అయితే ఈ ఆహారం తినే తొందరలో ఆ కుక్కపిల్ల పొరపాటున ప్రమోద్ కాళ్ళను కరిచింది.దీంతో ఆగ్రహానికి గురైన ఆయన కుక్కపిల్ల ముందు,వెనుక కాళ్ళను నరికివేశాడు.

cut off two legs of dog in newdelhi

ప్రమోద్ కుక్కపిల్ల కాళ్ళను నరికివేస్తోండగా ఇరుగుపొరుగు వారు చూసి జంతువుల హాక్కుల కార్యకర్తలకు ఫోన్ చేశారు. దీంతో జంతువుల హక్కుల కార్యకర్త గౌరవ్ శర్మ ప్రమోద్ పై పోలీసులకు ఫిర్యాదుచేశాడు.పోలీసులు ప్రమోద్ ను అరెస్టు చేశారు.

నిత్యం మద్యం మత్తులో ఉండే ప్రమోద్ భార్య పిల్లలను వేధిస్తాడు. కుక్క కాళ్ళను నరికాడని అరెస్టుచేసేందుకు వచ్చిన పోలీసులకు ప్రమోద్ క్రూరత్వాన్ని ఆయన భార్య వివరించింది.ఇటీవల కాలంలో ఓ కోతిని ఇంటికి తీసుకు వచ్చి ఆయన ఆ కోతిని నరికి చంపాడు. మద్యం తాగి భార్య ,పిల్లలను చిత్రహింసలు పెడతాడని కుటుంబసభ్యులు చెప్పారు. తనను తలకిందులుగా వేలాడదీస్తాడని ప్రమోద్ సతీమణి పోలీసులకు వివరించింది.గతంలో ప్రమోద్ గృహహింస కేసు కింద అరెస్టు అయ్యాడు.

English summary
pramod living in delhi, recently a dog bite parmod, pramod cutoff two legs of dog. before six months he brought to a monkey to his house, after some days he cut off monkey also. animal protection ngo complaint against pramod, police arrest him
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X