వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసమ్మతి నేతలకు సోనియా వార్నింగ్ : ఏ అంశాలనైనా చర్చిద్దాం-అతిక్రమిస్తే : సీడ‌బ్ల్యూసీ భేటీ లో కీలకంగా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి సమావేశంలో అధినేత్రి సోనియా అసమ్మతి నేతల పైన సీరియస్ అయ్యారు. కొద్ది సేపటి క్రితం ఆరంభమైన ఈ సమావేశంలో సోనియా ముందుగా అసమ్మతి నేతల అంశం పైన స్పందించారు. పార్టీలోని ఏ అంశాలపైన అయినా చర్చకు సిద్దమని స్పష్టం చేసారు. తాను ఫుల్ టైం కాంగ్రెస్ అధ్యక్షురాలినని సోనియా తేల్చి చెప్పారు. 23 గ్రూప్‌గా రూపొందిన సీనియ‌ర్ లీడ‌ర్లు గులాంన‌బీ ఆజాద్‌, ఆనంద్ శ‌ర్మ వంటి అస‌మ్మ‌తివాదులు పార్టీలో అంత‌ర్గ‌తంగా సంస్థాగ‌త ఎన్నిక‌లు నిర్వ‌హించాలని డిమాండ్ చేస్తున్నారు.

అసమ్మతి నేతలపైన అధినేత్రి ఆగ్రహం

పార్టీకి పూర్తిస్థాయి, శ‌క్తిమంత‌మైన నాయ‌క‌త్వాన్ని ఎన్నుకోవాలంటూ సోనియాగాంధీకి జీ23 గ్రూప్ నేత‌లు లేఖ రాశారు. అయితే, వారి పైన ఇప్పటి వరకు పార్టీ ఎటువంటి చర్యలకు ఉపక్రమించ లేదు. ఇప్పుడు ఈ సమావేశం ద్వారా సోనియా ఈ హెచ్చరికలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో మీడియాకు ఎక్కి పార్టీ ప్రతిష్ఠను తగ్గించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. సీడ‌బ్ల్యూసీ భేటీ గురించి పార్టీ సీనియర్ నేత ఆజాద్ లేఖ కూడా రాసారు. ఇక, పలు కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

తానే ఫుల్ టైం కాంగ్రెస్ అధినేత్రిని అంటూ

తానే ఫుల్ టైం కాంగ్రెస్ అధినేత్రిని అంటూ

కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రధాన అంశంగా నిలవనున్నట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఓడిన తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. ఆయన స్థానంలో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి తాత్కాలిక అధ్యక్షురాలి హోదాతోనే సోనియా పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే, తాజాగా సోనియా చేసిన ట్వీట్ ద్వారా ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడి ఎంపిక కు సంబంధించి సంస్థగత ఎన్నికల నిర్వహణ పైన కీలక నిర్ణయం తీసుకోవాలని కోరారు.

పార్టీ సంస్థాగత ఎన్నికల పైనా చర్చ

పార్టీ సంస్థాగత ఎన్నికల పైనా చర్చ

దీంతో..కొత్త అధ్యక్షుడి ఎంపిక..పార్టీ పరంగా సంస్థాగత ఎన్నికల పైన సీడ‌బ్ల్యూసీ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. జీ-23 గ్రూప్‌గా రూపొందిన సీనియ‌ర్ లీడ‌ర్లు గులాంన‌బీ ఆజాద్‌, ఆనంద్ శ‌ర్మ వంటి అస‌మ్మ‌తివాదులు పార్టీలో అంత‌ర్గ‌తంగా సంస్థాగ‌త ఎన్నిక‌లు నిర్వ‌హించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీకి పూర్తిస్థాయి, శ‌క్తిమంత‌మైన నాయ‌క‌త్వాన్ని ఎన్నుకోవాలంటూ సోనియాగాంధీకి జీ23 గ్రూప్ నేత‌లు లేఖ రాశారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టిన‌ట్లు తెలుస్తోంది.

అయిదు రాష్ట్రాల ఎన్నికలు మరో అజెండాగా

అయిదు రాష్ట్రాల ఎన్నికలు మరో అజెండాగా

అయితే, రాహుల్ గాంధీని కొత్త అధ్యక్షుడిగా చేయాలంటూ కాంగ్రెస్ లోని పలువురు నేతలు కోరుతున్నారు. కానీ, రాహుల్ మాత్రం కీలక పగ్గాలు చేపట్టేందుకు ముందుకు రావటం లేదు. ఈ సమావేశం ద్వారా దీని పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల పైన చర్చించనుంది. అందులో కీలకంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్ లో కొద్ది కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పైన చర్చించే ఛాన్స్ ఉంది.

Recommended Video

బీసి గణన చేపట్టాలని పిలుపునిస్తూ గాంధీ భవన్ లో బేటీ ఐన అఖిలపక్ష పార్టీ నేతలు!!
ఉత్తరప్రదేశ్ పైన స్పెషల్ ఫోకస్

ఉత్తరప్రదేశ్ పైన స్పెషల్ ఫోకస్

ఉత్తరప్రదేశ్ పైన సీడ‌బ్ల్యూసీ చర్చించనుంది. సంస్థగతంగా ఎన్నికల పైన నిర్ణక్ష్ం తీసుకుంటే.. ఇక పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వ న‌మోదుతోపాటు జిల్లా స్థాయి నుంచి జాతీయ అధ్య‌క్షుడి వ‌ర‌కు పూర్తిస్థాయిలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ చేప‌డ‌తారు. దీంతో పాటుగా తాజాగా ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకున్న లక్మీపూర్ ఘటన పైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక, అయిుద రాష్ట్రాల ఎన్నికల ద్వారా బీజేపీకి ధీటైన పోటీ ఇవ్వాలని సోనియా భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో..ఈ సమావేశంలో తీసుకొనే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.

English summary
Amid the ongoing CWC meet, interim President Sonia Gandhi warns the rebel leaders and asks them to have a healthy discussion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X