వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

cwc: కపిల్ సిబల్ అంతరిక్ష పల్టీ - నిమిషాల్లోనే ట్వీట్ డిలిట్ - రాహుల్ ఆ మాట అనలేదట

|
Google Oneindia TeluguNews

నాయకత్వ మార్పు, పార్టీ ప్రక్షాళన అంశాలే ప్రధాన అజెండాగా భేటీ అయిన కాంగ్రస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో థ్రిల్లర్ డ్రామాను తలపించేలా సీన్లు చోటుచేసుకున్నాయి. సోనియా గాంధీకి ఘాటు లేఖ రాసిన సీనియర్లను ఉద్దేశించి 'బీజేపీతో కుమ్మకయ్యారు'అని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేసిన దరిమిలా, ఇన్నాళ్లూ అధినేత్రికి అనునాయులుగా ఉన్న నేతలు రాజీనామాలకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. కపిల్ సిబల్ స్వయంగా తన ట్విటర్ లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. కానీ నిమిషాల వ్యవధిలో సిబల్ ఆ ట్వీట్ డిలిట్ చేయడం నాటకంలో అంతరీక్ష పల్టీని తలపించింది. దీనిపై రాహుల్, సుర్జేవాల సైతం స్పందించారు.

బీజేపీ వలలో సోనియా విధేయులు - రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు - ఆజాద్, సిబల్ రాజీనామాకు..బీజేపీ వలలో సోనియా విధేయులు - రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు - ఆజాద్, సిబల్ రాజీనామాకు..

అబ్బే రాహుల్ అలా అనలేదు..

అబ్బే రాహుల్ అలా అనలేదు..

30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ బీజేపీకి అనుకూలంగా మాట్లాడలేదని, పార్టీకి సంబంధించి న్యాయపోరాటాల్లో ముందుంటానని, అలాంటిది ‘‘బీజేపీతో కుమ్మకయ్యారని'' రాహుల్ గాంధీ అనడం బాధించిందంటూ మధ్యాహ్నం 1గంటకు సీనియర్ నేత కపిల్ సిబల్ ఓ ట్వీట్ చేశారు. రాహుల్ నోటి నుంచి వచ్చిన అనూహ్య వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెనుసంచలనం సృష్టించాయి. అయితే, సరిగ్గా 1:47కు సిబల్ మరో ట్వీట్ చేశారు. బీజేపీతో కుమ్మక్కు పదాలను రాహుల్ వాడలేదని, తానే పొరపాటు పడ్డానని ఆయన వివరణ ఇచ్చారు.

రాహుల్ గాంధీ వివరణ..

రాహుల్ గాంధీ వివరణ..

పార్టీ విధేయులైన సీనియర్లను ఉద్దేశించి ‘బీజేపీ వలలో పడ్డారు' అంటూ తాను అనని మాటలు మీడియాలో ప్రసారం అవుతున్నాయని రాహుల్ గాంధీ ఆవేదన చెందారు. సోనియా గాంధీ అస్వస్థతతో బాధపడుతున్న సమయంలో సీనియర్లు ఇలాంటి ఘాటు లేఖ రాయడంపై మాత్రమే తాను మాట్లాడానని, అధినేత్రి ఆరోగ్యం బాగోలేనప్పుడు సొంత నేతలే ఇలా వ్యవహరించడం సరికాదని మాత్రమే హితవు పలికానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీతో కుమ్మక్కు వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.

 ఆజాద్ పై ప్రియాంక ఫైర్..

ఆజాద్ పై ప్రియాంక ఫైర్..

‘బీజేపీతో కుమ్మక్కు' కామెట్లపై రగడ జరుగుతుండగానే, సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ను ఉద్దేశించి ప్రియాంక గాంధీ సీరియస్ కామెంట్లు చేసినట్లు తెలిసింది. పార్టీలో నాయకత్వ మార్పు, ప్రక్షాళనపై ఆజాద్ సహా సీనియర్లు లేఖలో రాసిన అంశాలకు, సీడబ్ల్యూసీలో మాట్లాడిన అంశాలకు పొంతన లేదని, బయట ఒకలా, లోపల మరోలా వ్యవహరించడం సరికాదని ప్రియాంక మండిపడ్డట్లు సమాచారం. అదివరకే, రాహుల్ ‘కుమ్మక్కు' కామెంట్లకు నొచ్చుకుని, రాజీనామా చేస్తానన్న ఆజాద్.. మళ్లీ ప్రియాంక నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవడం గమనార్హం.

కాంగ్రెస్ చీఫ్ పోస్టు నుంచి తప్పుకుంటా - సీనియర్ల లేఖకు సోనియా గాంధీ రిప్లై - సీడబ్ల్యూసీపై టెన్షన్కాంగ్రెస్ చీఫ్ పోస్టు నుంచి తప్పుకుంటా - సీనియర్ల లేఖకు సోనియా గాంధీ రిప్లై - సీడబ్ల్యూసీపై టెన్షన్

English summary
Kapil Sibal, who took to Twitter to attack Rahul Gandhi after the latter's alleged "dissenters colluding with BJP" remark at the CWC meeting, has now deleted the tweet, clarifying that the former Congress president never made the remarks. He said Rahul Gandhi himself informed him about it. "Was informed by Rahul Gandhi personally that he never said what was attributed to him. I, therefore, withdraw my tweet," Kapil Sibal wrote on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X